Samyuktha menon: పాప్ కార్న్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ అనంతరం తెలుగులో పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో రానాకి జోడిగా నటించిన ఈమె అనంతరం కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో కూడా సందడి చేశారు.ఇక ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పాల్గొన్నటువంటి సంయుక్త మీనన్ కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి కూడా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ స్కూల్లో చిన్నప్పుడు జాయిన్ చేయడానికి వెళ్ళగా తన పేరు పక్కన ఇంటిపేరు రాయమన్నారు. అసలు పేరు పక్కన ఈ తోక ఏంటి అనుకున్నాను కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా పేరు పక్కన మీనన్ సబబు కాదని అనిపించింది. ప్రేమ సమానత్వం మానవత్వం కోరుకుంటున్నప్పుడు తనకు ఇంటిపేరు అడ్డు వస్తుందని ఈమె తెలిపారు.
ఇక తన తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు తన తండ్రి ఇంటి పేరును తన తల్లి పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇక తాను కూడా తన తల్లి నిర్ణయాన్ని గౌరవించి తన పేరు పక్కన తన ఇంటి పేరును తొలగించానని కేవలం మా అమ్మ నిర్ణయాన్ని గౌరవించడం కోసమే తాను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని ఈ సందర్భంగా నటి సంయుక్త చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…
ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…