Sandeep Kishan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా కొత్త వాళ్లకి పెద్దగా అవకాశాలు రావు ఒకవేళ అవకాశాలు వచ్చిన వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎక్కువగా నేపోటిజెమ్ గురించి తరచూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతుంటాయి. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం హీరో నిఖిల్ కొందరు సినీ ప్రముఖులు తన సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మరొక యంగ్ హీరో సందీప్ కిషన్ సైతం ఇండస్ట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ చాలా కాలం తర్వాత మైకేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాని విడుదల చేయకుండా ఒక స్టార్ హీరో వారసుడు అడ్డుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విధంగా తన సినిమాని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సందీప్ కిషన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఒక సినిమాని ఎంతోమంది స్టార్స్ తొక్కేయాలని చూసిన మనలో టాలెంట్ ఉండి సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ఏమి చేయలేరు అంటూ ఈయన షాకింగ్ సమాధానం చెప్పారు. ఇకపోతే ఈ సినిమా కోసం సందీప్ కిషన్ ఏకంగా 24 కిలోలు బరువు తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ విధంగా ఒక సినిమా కోసం 24 కిలోల బరువు తగ్గాలంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసినటువంటి పోస్టర్ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా కూడా అతి త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా ఈ సినిమా విడుదల అవుతున్న తరుణంలోనే ఈ సినిమాని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…