Movie News

Sanjay Dutt: చనిపోయిన పర్వాలేదు కానీ కాన్సర్ కి చికిత్స తీసుకోనని చెప్పాను…. సంజయ్ దత్ కామెంట్స్ వైరల్!

Sanjay Dutt: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంజయ్ దత్ గురించి అందరికీ సుపరిచితమే.ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన క్యాన్సర్ బారిన పడి ఈ ప్రాణాంతకరమైన వ్యాధి నుంచి బయటపడినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. కాన్సర్ కు చికిత్స ఉన్నప్పటికీ ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడటం అంత సులువైన విషయం కాదని డాక్టర్లు చెబుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సంజయ్ దత్ కుటుంబంలో చాలామంది క్యాన్సర్ బారిన పడి మరణించారు. సంజయ్ తల్లి అలాగే తన మొదటి భార్య కూడా ఈ క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఈయన కూడా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ బ్రతికి బయటపడ్డానని తెలియజేశారు. తనకొక రోజు వెన్నులో నొప్పి అధికంగా ఉండడంతో హాస్పిటల్ కి వెళ్ళానని ఆ సమయంలో తన వెంట తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరని తెలిపారు.

ఇలా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కొన్ని పరీక్షలు చేసి ఒక వ్యక్తి వచ్చి మీకు క్యాన్సర్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యాధి ఉందని తెలియగానే తాను ట్రీట్మెంట్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాధికి కీమోతెరపి తీసుకోవడం ఎంతో కఠినంగా ఉంటుంది. ఈ కీమోతెరపి తీసుకోవడం కన్నా చనిపోవడమే మంచిదని భావించాను.

Sanjay Dutt: ప్రాణాంతకర వ్యాధితో పోరాడి బయటపడ్డాను…

ఇక తన రెండో భార్య మాన్యత తన కుటుంబ సభ్యుల బలవంతంతో తాను కీమోతేరపీ చేయించుకున్నానని కీమోథెరపీ కారణంగా తాను ఈ మహమ్మారి నుంచి కోలుకొని బయటపడ్డానని తెలిపారు. ఏదో ప్రాణాంతకరమైన ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా బయటపడవచ్చు అలా తాను కూడా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడి అనంతరం కేజిఎఫ్2 సినిమా పూర్తి చేశానని ఈ సందర్భంగా సంజయ్ దత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago