Sara Khan: టాలీవుడ్‌లో గానీ, బాలీవుడ్‌లో గానీ అత్యంత ప్రాచుర్యం పొందిన షోలల్లో ఒకటిగా నిలిచింది బిగ్‌బాస్. అలాంటి వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన మరో కార్యక్రమం లాకప్. భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకూ, కాంట్రవర్సీలకూ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఈ షోకు హోస్ట్‌గా నిర్వహించడం మరో ప్రత్యేకత. అయితో ఈ షో ద్వారా సెలబ్రెటీలు తమ జీవితంలో జరిగిన రహస్యాలు మరియు ఎవరికీ తెలియని పర్సనల్ విషయాలను చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
అయితే ఇప్పటి వరకూ చాలా మంది నటీనటులు ఈ షోలు పాల్గొని తమ సీక్రెట్ విషయాలతో ముందుకు వచ్చిన విషయం విధితమే. కాగా తాజాగా మాజీ భార్యభర్తలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. వీరు విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి ఈ షోలో కలిసి పాల్గొని ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. వారే సారా ఖాన్, అలీ మర్చంట్. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట,కొంతకాలానికే మనస్ఫర్థలు వచ్చి విడిపోయారు.
తాజాగా వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటో సారా ఖాన్ ఈ షో ద్వారా బయటపెట్టారు . ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి చేసుకొని అప్పట్లో ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత కూడా అలీకి వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉండేదని సారా చెప్పుకొచ్చారు. తాను అలీని చాలా ప్రేమించానని, అందుకే తనకు వేరే అమ్మాయిలకో సంబంధం ఉందని తెలిసినా ఏమీ అనలేదని ఆమె చెప్పారు.
దాదాపు మూడున్నర సంవత్సరాల్లో 300 ఛాన్సులు ఇచ్చినా కూడా అలీ వాటిని నిలబెట్టుకోలేకపోయాడని సారా తెలిపారు. తనకు లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉందని, అందులో పనిచేసే ఓ అమ్మాయితో అలీ సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆమె వెల్లడించారు విడాకుల తర్వాత తాను మళ్లీ మామూలు మనిషి కావడానికి తనకు నాలుగు సంవత్సరాలు పట్టిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సారా. తాజాగా ఆమె చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…