Sarika Tagore : అందం, అభినయం మాత్రమే కాదు ఒక హీరోయిన్ కి తెలివితేటలూ ఉండాలి అమాయకంగా ఉంటే అందరు మోసం చేసే వాళ్ళే. ఈ విషయం ఎంతోమంది హీరోయిన్స్ అందునా సిల్వర్ స్క్రీన్ ను ఏలిన తారామణుల విషయంలో జరిగింది. ఒకప్పటి సావిత్రి, మరో తరానికి శ్రీదేవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అందాల తారలు వారి జీవితం ఎలా ముగిసిందో అందరికి తెలుసు. ఆర్ధిక అవసరాల కోసం వారి చిన్నతనంలోనే కుటుంబ భాద్యతలను నెత్తిన వేసుకుని ముఖానికి రంగువేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. వారి అందమైన బాల్యాన్ని కుటుంబం కోసం త్యాగం చేసి కష్టపడినా చివరికి మళ్ళీ పేదరికంలోనే మగ్గుతున్న వారు లేకపోలేదు. అలాంటి ఒక జీవిత కథే సారిక ఠాగూర్ ది కూడా.
సారిక కన్నీటి వ్యధ….
చిన్నతనంలోనే తండ్రి, తనని తల్లిని వదిలేస్తే చదువుకోవాల్సిన వయసులో ఆర్ధిక అవసరాల కోసం బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఇక తన ప్రతిభతో మంచి అవకాశాలను అందుకుని మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ తల్లి ప్రేమకు నోచుకోలేదు. తల్లి తనను కేవలం డబ్బు యంత్రంగానే చూసింది. ఇక సారిక సంపాదించిన డబ్బు అసలు తల్లి ఏమి చేస్తోందో అడిగే ధైర్యం సారికాకు లేదు. సంపాదించేది తానే అయిన ఆ లెక్కలేవి తనకు తెలియదు అడిగితే అమ్మ కొడుతుందనే భయం ఉండేది. అంత సంపాదిస్తున్నా స్నేహితుల ఇళ్లల్లో స్నానం చేసి కారులో పడుకోవడం లాంటివి చేస్తూ ఇంటికి వెళ్లకుండా నెట్టుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి షూటింగ్ కు వాళ్ళ అమ్మ తోడు రాకపోవడంతో షూటింగులో ఇచ్చిన 1500 రూపాయలను చదువంటే ఎంతో ఇష్టమైన సారిక మొత్తం డబ్బులకు పుస్తకాలు కొనడంతో తల్లి చితకబాదింది. ఇక చదువు కోసం ట్యూషన్ పెట్టించిన ట్యూషన్ మాస్టర్ ఏమి నేర్పించకుండా డబ్బు తీసుకుని మోసం చేసాడు.
సారిక తల్లి మరణంతో స్వేచ్ఛ….
ఇక తల్లి వల్ల నానా బాధలు పడిన సారిక, తల్లి మరణంతో కొంత ఊరట చెందింది. స్వేచ్ఛ అయితే లభించింది కానీ తాను అప్పటికే బిజీ ఆర్టిస్ట్ బాగా సంపాదించింది తల్లి ఐదు అపార్ట్‌మెంటుల్లో ఇళ్ళు తీసిందని తెలుసు కానీ వాటిని తాను ఎవరికో ఇచ్చేసిందని తెలిసి సారిక మరోసారి పేదరికంలో వచ్చేసింది. ఇక ఈ సమయంలో అమీర్ ఖాన్ తనకు ఆస్తుల లీగల్ హెల్ప్ చేసాడని అందరు అంటారు. అమీరఖాన్ కజిన్ నుజిత్ సారికకు మంచి ఫ్రెండ్ అందుకే తనకోసం అమీర్ ఖాన్ సహాయం చేసాడట.
సారిక రిలేషన్ షిప్స్……
ఇక తల్లి మరణించాక ఒంటరితనంతో ఉన్న సారిక భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తో ప్రేమలో పడింది తరచూ వాళ్ళ ఇంటికి చండీఘడ్ కు కూడా వెళ్ళేది. ఇక కపిల్ కు మరో గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆమెనే పెళ్లిచేసుకుంటాడు అని తెలిసాక వారి బంధం బ్రేక్ అయింది, సారిక మళ్ళీ ఒంటరిదైంది. ఇక మళ్ళీ తాను బాలనటిగా ఉన్నప్పటి నుండి తెలిసిన సచిన్ పిల్గావ్కర్‌ను ప్రేమించింది ఇక ఆ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. ఇక మళ్ళీ మోడల్ పరషార్ తో ప్రేమా అది విఫలం ఇక చివరికి కమల్ తో ప్రేమాయణం ముంబై లో ఉన్నా కమల్ తో సహజీవనం చేసింది 1986 లో శృతి హాసన్ జన్మించింది. అప్పటికే కమల్ హాసన్ వాణి గజపతి ని వివాహం చేసుకున్నారు.
ఇక ఆమెకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకుంటారనే మాటలు నిజం చేస్తూ వారు సహజీవనం కొనసాగించారు. శృతి హాసన్ జన్మించాక కమల్ హాసన్ సారిక 1991 లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తరువాత వారికి అక్షర హాసన్ జన్మించింది. ఇక ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు 2004 లో కమల్ హాసన్ సారిక వీడిపోయారు. కమల్ తో వివాహం తరువాత ఇండస్ట్రీ ని వీడిన సారిక మళ్ళీ ఒంటరిదైంది. ఆర్థికంగాను కష్టాల్లోకి వెళ్ళింది. విడాకుల తరువాత కమల్ హాసన్ భరణం ఇచ్చాడో లేదు ఎవరికి తెలియదు. ఇక పిల్లలిద్దరు తండ్రి వద్దే పెరిగారు. సారిక పేదరికంలో మగ్గుతున్న కమల్ హాసన్ కానీ ఇరు కూతుర్లు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు అనే విమర్శ ఉంది. ఇక ఈ మధ్యనే మళ్ళీ ఓటిటి లో మే 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మోడ్రన్ లవ్: ముంబై వెబ్ సిరీస్ తో సారిక ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. సూరజ్ బర్జాత్యా సినిమాలోనూ సారిక నటిస్తోంది. విడాకుల తరువాత ఆస్తులన్నీ కరిగిపోవడంతో రోజుకు 2000కు స్టేజి షోలు కూడా సారిక చేసింది. జీవితంలో కోట్లు సంపాదించిన చివరకు తిండికి కూడా అవస్థలు పడి ఒంటరిగానే మిగిలిపోయింది సారిక.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…