Sarika Tagore : అందం, అభినయం మాత్రమే కాదు ఒక హీరోయిన్ కి తెలివితేటలూ ఉండాలి అమాయకంగా ఉంటే అందరు మోసం చేసే వాళ్ళే. ఈ విషయం ఎంతోమంది హీరోయిన్స్ అందునా సిల్వర్ స్క్రీన్ ను ఏలిన తారామణుల విషయంలో జరిగింది. ఒకప్పటి సావిత్రి, మరో తరానికి శ్రీదేవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అందాల తారలు వారి జీవితం ఎలా ముగిసిందో అందరికి తెలుసు. ఆర్ధిక అవసరాల కోసం వారి చిన్నతనంలోనే కుటుంబ భాద్యతలను నెత్తిన వేసుకుని ముఖానికి రంగువేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. వారి అందమైన బాల్యాన్ని కుటుంబం కోసం త్యాగం చేసి కష్టపడినా చివరికి మళ్ళీ పేదరికంలోనే మగ్గుతున్న వారు లేకపోలేదు. అలాంటి ఒక జీవిత కథే సారిక ఠాగూర్ ది కూడా.
సారిక కన్నీటి వ్యధ…. చిన్నతనంలోనే తండ్రి, తనని తల్లిని వదిలేస్తే చదువుకోవాల్సిన వయసులో ఆర్ధిక అవసరాల కోసం బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఇక తన ప్రతిభతో మంచి అవకాశాలను అందుకుని మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ తల్లి ప్రేమకు నోచుకోలేదు. తల్లి తనను కేవలం డబ్బు యంత్రంగానే చూసింది. ఇక సారిక సంపాదించిన డబ్బు అసలు తల్లి ఏమి చేస్తోందో అడిగే ధైర్యం సారికాకు లేదు. సంపాదించేది తానే అయిన ఆ లెక్కలేవి తనకు తెలియదు అడిగితే అమ్మ కొడుతుందనే భయం ఉండేది. అంత సంపాదిస్తున్నా స్నేహితుల ఇళ్లల్లో స్నానం చేసి కారులో పడుకోవడం లాంటివి చేస్తూ ఇంటికి వెళ్లకుండా నెట్టుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి షూటింగ్ కు వాళ్ళ అమ్మ తోడు రాకపోవడంతో షూటింగులో ఇచ్చిన 1500 రూపాయలను చదువంటే ఎంతో ఇష్టమైన సారిక మొత్తం డబ్బులకు పుస్తకాలు కొనడంతో తల్లి చితకబాదింది. ఇక చదువు కోసం ట్యూషన్ పెట్టించిన ట్యూషన్ మాస్టర్ ఏమి నేర్పించకుండా డబ్బు తీసుకుని మోసం చేసాడు.
సారిక తల్లి మరణంతో స్వేచ్ఛ….
Advertisement
ఇక తల్లి వల్ల నానా బాధలు పడిన సారిక, తల్లి మరణంతో కొంత ఊరట చెందింది. స్వేచ్ఛ అయితే లభించింది కానీ తాను అప్పటికే బిజీ ఆర్టిస్ట్ బాగా సంపాదించింది తల్లి ఐదు అపార్ట్మెంటుల్లో ఇళ్ళు తీసిందని తెలుసు కానీ వాటిని తాను ఎవరికో ఇచ్చేసిందని తెలిసి సారిక మరోసారి పేదరికంలో వచ్చేసింది. ఇక ఈ సమయంలో అమీర్ ఖాన్ తనకు ఆస్తుల లీగల్ హెల్ప్ చేసాడని అందరు అంటారు. అమీరఖాన్ కజిన్ నుజిత్ సారికకు మంచి ఫ్రెండ్ అందుకే తనకోసం అమీర్ ఖాన్ సహాయం చేసాడట.
సారిక రిలేషన్ షిప్స్……
ఇక తల్లి మరణించాక ఒంటరితనంతో ఉన్న సారిక భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తో ప్రేమలో పడింది తరచూ వాళ్ళ ఇంటికి చండీఘడ్ కు కూడా వెళ్ళేది. ఇక కపిల్ కు మరో గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆమెనే పెళ్లిచేసుకుంటాడు అని తెలిసాక వారి బంధం బ్రేక్ అయింది, సారిక మళ్ళీ ఒంటరిదైంది. ఇక మళ్ళీ తాను బాలనటిగా ఉన్నప్పటి నుండి తెలిసిన సచిన్ పిల్గావ్కర్ను ప్రేమించింది ఇక ఆ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. ఇక మళ్ళీ మోడల్ పరషార్ తో ప్రేమా అది విఫలం ఇక చివరికి కమల్ తో ప్రేమాయణం ముంబై లో ఉన్నా కమల్ తో సహజీవనం చేసింది 1986 లో శృతి హాసన్ జన్మించింది. అప్పటికే కమల్ హాసన్ వాణి గజపతి ని వివాహం చేసుకున్నారు.
ఇక ఆమెకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకుంటారనే మాటలు నిజం చేస్తూ వారు సహజీవనం కొనసాగించారు. శృతి హాసన్ జన్మించాక కమల్ హాసన్ సారిక 1991 లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తరువాత వారికి అక్షర హాసన్ జన్మించింది. ఇక ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు 2004 లో కమల్ హాసన్ సారిక వీడిపోయారు. కమల్ తో వివాహం తరువాత ఇండస్ట్రీ ని వీడిన సారిక మళ్ళీ ఒంటరిదైంది. ఆర్థికంగాను కష్టాల్లోకి వెళ్ళింది. విడాకుల తరువాత కమల్ హాసన్ భరణం ఇచ్చాడో లేదు ఎవరికి తెలియదు. ఇక పిల్లలిద్దరు తండ్రి వద్దే పెరిగారు. సారిక పేదరికంలో మగ్గుతున్న కమల్ హాసన్ కానీ ఇరు కూతుర్లు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు అనే విమర్శ ఉంది. ఇక ఈ మధ్యనే మళ్ళీ ఓటిటి లో మే 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మోడ్రన్ లవ్: ముంబై వెబ్ సిరీస్ తో సారిక ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. సూరజ్ బర్జాత్యా సినిమాలోనూ సారిక నటిస్తోంది. విడాకుల తరువాత ఆస్తులన్నీ కరిగిపోవడంతో రోజుకు 2000కు స్టేజి షోలు కూడా సారిక చేసింది. జీవితంలో కోట్లు సంపాదించిన చివరకు తిండికి కూడా అవస్థలు పడి ఒంటరిగానే మిగిలిపోయింది సారిక.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.