Sarkaaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి కీర్తి సురేష్ హీరోయిన్ గా కలిసి నటించిన సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జి ఎం బి ఎంటర్ టైన్ మెంట్స్, సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మే 12న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని మహేష్ బాబు కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో మహేష్ బాబు నటనను చూసిన పలువురు దర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
థియేటర్ లో నమ్రత సందడి…..
మహేష్ బాబు సినిమాని థియేటర్లో చూడాలని అభిమానులే కాకుండా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సినిమా థియేటర్ కు వెళ్లి మరీ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలనే నమ్రతా శిరోద్కర్ అభిమానులతో కలిసి భ్రమరాంబ థియేటర్లో మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాను చూశారు. ఇటీవలే అభిమానులతో కలిసి థియేటర్లో సందడి చేసిన నమ్రత మరొకసారి థియేటర్ కు వచ్చి సందడి చేసారు.
తాజాగా నమ్రత శిరోద్కర్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో సందడి చేశారు. సుదర్శన్ థియేటర్ లో స్పెషల్ షో చూడటానికి వచ్చిన నమ్రతా శిరోద్కర్ కు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈసారి కూడా మహేష్ అభిమానులతో కలిసి థియేటర్లో సర్కార్ వారి పాట సినిమాను చూసారు నమ్రత . అయితే ప్రస్తుతం నమ్రతా శిరోద్కర్ థియేటర్లో సందడి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…