Featured

Sarkaaru Vaari Paata : సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు గాజు గ్లాస్ సీన్ తో పవన్ జనసేనని టార్గెట్ చేశారా..?

Sarkaaru Vaari Paata : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమా సర్కారు వారి పాట. రెండేళ్ల తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు మే 12న వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదటి సారి నటించింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలోని మహేష్ బాబు లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే టికెట్ రేట్లు అధికంగా ఉండడం వలన ప్రేక్షకులు సినిమా థియేటర్ కు రావట్లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు డైలాగులు కొంతమందిని విమర్శించినట్టుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ సినిమాలోని ఒక సీన్ వివాదాస్ప‌దంగా మారుతోంది. ఆ వివాస్పద సీన్‌ జ‌న‌సేన పార్టీని ఉద్దేశించి తీసింద‌ని విమర్శలకు దారితీస్తోంది.

హాట్ టాపిక్ గా మారిన గాజు గ్లాస్ సీన్…..

ప్రస్తుతం ఈ సినిమాలోని గాజు గ్లాస్ సీన్ హాట్ టాపిక్ అవుతోంది. అయితే సీన్ ఏంటంటే… స‌ర్కారు వారి పాట సినిమాలో… ఒక సీన్‌లో ప్ర‌భాస్ శ్రీ‌ను రిక‌వ‌రీ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటారు ఆ క్రమం లో తన గొంతులోకి గాజు గ్లాస్‌ను పంపిస్తారు. అయితే గొంతులోకి గాజు గ్లాస్ వెళ్ల‌గానే.. ఏంటండి బాబు, ఇప్పుడు ఇది ఎలా బ‌య‌ట‌కు వ‌స్తుంది.. అని ప్రభాస్ శ్రీను ప్ర‌శ్నిస్తాడు. దీనికి సమాధానంగా .. రిక‌వ‌రీ ఏజెంట్‌వి క‌దా.. రిక‌వ‌రీ చెయ్యి.. అంటూ మ‌హేష్ డైలాగ్ వస్తుంది.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ గుర్తు కూడా గాజు గ్లాసే కావడంతో, దీంతో పవన్ ను, జనసేన పార్టీని టార్గెట్ చేసి ఆ సీన్‌ను తీశార‌ని.. ప‌వ‌న్ ఫ్యాన్స్, ఇంకా జ‌న‌సేన కార్య‌కర్త‌లు ఆరోపనాలు చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది పవన్ అభిమానులు సాధార‌ణంగానే ఆ సీన్‌ పెట్టారని .. అందులో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలూ కూడా వస్తున్నాయ్. దీంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఈ విష‌యం ఇలాంటి మ‌లుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

1 hour ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

2 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

2 hours ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

2 hours ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

2 hours ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

2 hours ago