Senior Actor Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోను ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీ లో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఇండస్ట్రీస్ లో చిరంజీవి గారు వేరు….
చిరంజీవి గారి కెరీర్ మొదట్లో వరుసగా మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కవిత , చిరంజీవి గారితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఆయన కష్ట సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు పడిన సందర్భాల్లో అండగా ఉన్నారని ధైర్యం చెప్పారంటు కవిత చెప్పారు. అయన నుండి ఇండస్ట్రీ లో అందరూ చాలా నేర్చుకోవాలని ఆయన ఎంత ఎత్తులో ఉన్న అందరిని అంతే గౌరవిస్తూ చిన్న ఆర్థిస్టులను కూడా గుర్తు పెట్టుకుని పలకరిస్తారని తెలిపారు కవిత.

ఆయన ఎంత ఎదిగిన మనం ఒదిగే ఉండాలనడానికి మంచి ఉదాహరణ అంటూ చెప్పారు. ఆయన ఎంతో మంది ఆయనతో పనిచేసిన వారికే కాకుండా ఆయనకు పరిచయం లేని వారికీ కూడా ఎంతో సహాయం చేసారని చిరంజీవి గారి గొప్పతనం గురించి తెలిపారు కవిత.