Senior Actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, ఇక సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినడానికి కారణాలు అవే…
నరసింహారాజు గారు మంచి హిట్ సినిమాల్లో నటించినా జానపద హీరోగా సక్సెస్ అయినట్లు సాంఘిక చిత్రల్లో పెద్దగా హిట్లు కొట్టలేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కూడా ఒక్కోసారి లేట్ అవుతుంటుంది అందుకే ఆయన హీరోగా ఎక్కువకాలం చేయలేకపోయారు. ఇక అందరి నటులతోను స్నేహంగా ఉండే నరసింహారాజు గారు కత్తి పట్టి సినిమాల్లో కనిపించిన వాళ్లంతా ఆర్థికంగా చితికిపోయారు అనే వాదనను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని సినిమాలు చేసినప్పుడు వచ్చే డబ్బు అదే సినిమాలో పెట్టుబడిగా పెడితే పోతుంది. కాంతారావు గారు, సావిత్రి గారు అలానే పోగొట్టుకున్నారు.
కొన్నిసినిమాలను స్వయంగా నిర్మించడం వల్ల సినిమాలు పోయాయి వాటితో ఆస్తులను కొంతవరకు పోగొట్టుకున్నారు. కాంతారావు గారు అలానే చెన్నై లో తనకు ఉన్న పెద్ద భవనాలను అమ్మి అప్పుతీర్చారు. ఇక మేము రాజులం అవడంతో నాన్న గారు దాన ధర్మాలను ఎక్కువ చేసేవారు అలా ఆస్తులు పోయాయి. ఇక అప్పులను చేయడం వల్ల నేను సినిమాల్లోకి వచ్చాక కొంతవరకు తీర్చాను. అలా కాకుండా డబ్బు ఆస్తులు చేయడానికి వాడుంటే ఇప్పుడు ఇంకా బాగా సంపాదించుండేవాడిని. అదీకాక వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల ఆస్తులు చేసుకోలేదు. ఆర్థికంగా ఒక దశలో బాగా ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పారు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…