Senior Journalist Bharadwaja : మల్టీ స్టారర్ సినిమాలంటే పాత తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వీరి టైములో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒకానొక టైములో ఇగో క్లాష్ వచ్చినా కూడా ఇద్దరు హీరోలు కలిసి నటించేవారు. అయితే తరువాత వచ్చిన హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరు మాత్రం మల్టీ స్టారర్ సినిమాలను చేయలేదు. దీనికి ప్రధాన కారణం హీరో ఫ్యాన్స్ కి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు. చాలా మటుకు ఇగో ఇబ్బందులకు వాళ్లే ఏ డైరెక్టర్ ఇద్దరు అగ్రహీరోలను కలిపి సినిమా తీసే సాహాసం చేయలేదు. ఇక రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో ఇటీవల అల్లు అరవింద్ బాలయ్య, చిరు కాంబినేషన్ లో సినిమా చేయడం కల అంటూ చెప్పడంతో మళ్ళీ వీరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గురించి చర్చలు మొదలయ్యాయి. దీంతో ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
చిరు, బాలయ్య మధ్యలో గొడవలు…
చిరంజీవి, బాకృష్ణ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలని కోదండ రామి రెడ్డి ప్రయత్నించినా, ఆ ఇద్దరు హీరోలు సుముఖంగా ఉన్నా ఎందుకో అది జరగలేదు. అయితే వారి మధ్య ఎప్పుడు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు, కేవలం ఫ్యాన్స్ మధ్య ఉన్నాయి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ ఇంట్లో బెల్లం కొండ సురేష్ మీద జరిగిన కాల్పుల ఘటన సమయంలో కూడా బాలకృష్ణ ను హాస్పిటల్ కు తరలించాక చాలా సేపు అల్లు అరవింద్, చిరంజీవి, బాలకృష్ణ దగ్గరే ఉన్నారు. ఈ విషయం అప్పుడు దిన పత్రికలను ఎక్కువగా ఫాలో అయిన అందరికీ తెలిసిన విషయమే అంటూ చెప్పారు భరద్వాజ గారు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని ఉంది అన్నారు.
ఇక బాలకృష్ణ అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అని చెప్పడం మీద భరద్వాజ గారు మాట్లాడుతూ వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేయగల డైరెక్టర్ కథ రెండు దొరికితే ఖచ్చితంగా అది పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ అవుతుంది అంటూ చెప్పారు. రాజమౌళి ఆల్రడీ ఆర్ఆర్ఆర్ తీసి చరణ్, తారక్ ను కలిపి సినిమా చేసారు కాబట్టి ఆయనకు బాలయ్య, చిరంజీవితో సినిమాలను చేయాలని ఉందని చెప్పారు కాబట్టి మంచికథ సిద్ధం చేస్తే ఖచ్చితంగా వాళ్లిద్దరూ చేస్తారు ఇక ఆ సినిమా ఖచ్చితంగా మంచి క్రేజీ ప్రొజెక్ట్ అవుతుంది అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…