Senior Journalist Bhardwaja : ప్రముఖ గాయని వాణి జయరాం అనుమానాస్పద స్థితిలో ఆమె ఇంట్లోనే మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె మరణం సహజమరణం కాదు అని ఎవరో హత్య చేసారు అనే పుకార్లు బాగా వినబడ్డాయి. ఇక ఆమె ముఖం మీద గాయాలు ఉండటం వల్ల ఈ వదంతులు ఎక్కువయ్యాయి. అయితే వాణి జయరాం కేసును దర్యాప్తుకు పోలీసులు ఆమె మరణం మీద ఎలాంటి అనుమానాలు లేవంటూ చెప్పారు. సహజంగానే మరణించినట్లు పోలీసులు తేల్చారు. అయినా ఈ విషయంలో ఎన్నో అనుమానాలు అలానే ఉన్నాయి.

లెజెండ్రి సింగర్ వాణి జయరాం…
సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వాణి జయరాం గారి గురించి మాట్లాడుతూ తెలుగు పాటపై ఆమె చెరగని ముద్ర వేసారంటూ అభిప్రాయపడ్డారు. తమిళ గాయని అయినా కూడా తెలుగు ఉచ్చారణలో తడబడలేదని ఎంతో సహజంగా ఆమె తెలుగు ఉందంటూ ఆమె గాత్రం గురించి భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఇక ఆమె మరణం సంగీత ప్రియులకు తీరని లోటు అంటూ, అయితే ఆమె మరణం పట్ల ఇంత చర్చ అవసరం లేదంటూ చెప్పారు. వాణి జయరాం గారికి పిల్లలు లేరు ఒంటరిగా జీవిస్తున్నారు. చనిపోయిన రోజు కూడా ఆమె దురదృష్టవశాత్తు పడిపోవడం వల్ల ముఖానికి గాయాలు అయ్యాయని, శబ్దం రావడంతో వెంటనే పని మనిషి గదిలోకి వెళ్లి చూసి బంధువులకు ఫోన్ చేసిందని పోలీసులు వివరించారు.

ఇక అనుమానస్పదంగా ఎలాంటి విషయాలు లేవని అంతకు ముందు ఇంటి వద్ద ఎవరైనా అనుమానస్పదంగా తిరిగినది కూడా లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా కూడా ఆమెది సహజ మరణం అని తెలిపినట్లు భరద్వాజ గారు వివరించారు. అలాంటవుడు ఆమె మృతి పట్ల అనుమానాలను వ్యక్తపరుస్తూ చర్చిస్తూ రచ్చచేయడం తగదు, ఆమె ఒక లెజెండ్రి సింగర్ ఆమె భౌతికంగా దూరమైన పాటల ద్వారా సజీవంగా ఉంటారు అంటూ ఆమె మరణం గురించి చర్చ జరపకపోవడం మంచిదంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.