Featured

Senior Journalist Bhardwaja : కాంతార తో పోటీపడలేక బొక్కబోర్లా పడ్డ నాలుగు సినిమాలు… అంచనాలకు మించి రికార్డులు సృష్టిస్తున్న కాంతార హిట్ వెనుక ప్రధాన కారణాలు ఇవే : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ప్రస్తుతం సౌత్ ని ఉపేస్తున్న సినిమా కాంతార. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఏ మాత్రం ప్రచారం లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వసూళ్లలో కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లను మించి పోయింది. ఐఎండిబి రేటింగ్స్ లో కూడా ఈ రెండు సినిమాలను దాటేసింది. కన్నడ చిత్రమైనా ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ తో పెద్ద సినిమాలను కుడా పక్కకు నెట్టి దూసుకుపోతోంది ఈ సినిమా. కాంతార సినిమాను రిషబ్ శెట్టి తన సొంతూరు లో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో హీరో కూడా రిషబ్ శెట్టి నే దేవుడితో మాట్లాడే వారి తెగ గురించి ప్రపంచానికి ఈ సినిమా ద్వారా పరిచయం చేసాడు రిషబ్ శెట్టి.

సినిమా విజయానికి అదే కారణం…

ఇక కాంతార సినిమా తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ సినిమా విజయాన్ని కారణాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వివరించారు. సినిమా నేటివిటీకి సంబంధించినది కావడం, గ్రాఫిక్స్ ఏమీ లేకున్నా సహజంగా సినిమాను తీయడం వల్ల జనాలకు సినిమా బాగా నచ్చింది. ఇక సినిమాలో హీరో అంటూ ఏమాత్రం స్పెషల్ గా చూపించకుండా తమ వాళ్లలో ఒకడిగా సినిమాలో హీరోని డైరెక్టర్ చూపించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడొస్తున్న గ్రాఫిక్స్ సినిమాల నడుమ జనాలకు కొత్తదనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు.

సినిమాను చూడటం కాదు అనుభూతి చెందాలి, దీపావళికి విడుదల అయిన సినిమాలలో అది కాంతార సినిమాలో మాత్రమే ఉంది మరే సినిమా అందుకు దగ్గర్లో లేకపోవడం వల్ల ఇంకా సినిమాను జనాలు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను అడ్డుకోగల సినిమా ప్రస్తుతం లేదు కానీ తాజాగా విడుదల అయిన కార్తీ సినిమా ‘సర్ధార్’ కొంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అది కూడా నేటివిటీ సమస్యలతోనే వచ్చిన సినిమా కాకపోతే జనాలకు సినిమా కాన్సెప్ట్ అర్థమవడానికి టైం పడుతుంది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

23 hours ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

23 hours ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago