Senior journalist Bhardwaja : బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టోపబుల్ షో ఆహా ఒరిజినల్స్ కే సూపర్ హిట్. షో కోసం మాత్రమే ఆహా సబ్స్క్రిప్షన్ కొన్నవాళ్లు ఉన్నారు. రేటింగ్స్ లో దుమ్ముదులుపిన ఈ షో సీజన్ 2 వచ్చేసింది. ఇక మొదటి ఎపిసోడ్ తోనే మళ్ళీ రికార్డులను తిరగశారు ఆహా వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఈ షోకి వచ్చి కనువిందు చేసారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో యూత్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో సందడి చేసి బాలయ్య రచ్చ చేసాడు. ఇక తరువాత శర్వానంద్, అడవి శేష్, లెజెండ్రి డైరెక్టర్స్, అలానే ఎక్స్ సీఎం కిరణ్ ఇలా అందరూ అన్ స్టాపబుల్ కి వచ్చి సందడి చేసారు. అయితే తాజాగా ఈ షో ఇన్ని రోజుల రికార్డ్స్ మరోసారి బద్దలవుతున్నాయి. ఈసారి ఎపిసోడ్ కి డార్లింగ్ ప్రభాస్, హీరో గోపిచంద్ వస్తుండడం తో రేటింగ్స్ బద్ధలవ్వబోతున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన అన్ స్టాపబుల్ కొత్త ప్రోమో గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
జనాలు మాట్లాడుకున్నవే షోలో ప్రశ్నలు…
బాలకృష్ణ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ నుండి అడుగుతున్న ప్రశ్నలు బయట జనం మాట్లాడుకుంటున్నవి, సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్న ప్రశ్నల్నే. చాలా బోల్డ్ గా బాలయ్య వచ్చిన గెస్ట్ లను అడుగుతున్నాడు అంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ అభిప్రాయపడ్డారు. అదే షోకి మెయిన్ హైలైట్, ప్రోమోలో ఆ విషయాన్ని క్లుప్తంగా చూపించడం ద్వారా ఎపిసోడ్ మీద ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ దగ్గగర కూడా అదే చేసారు.
ప్రభాస్ అనగానే పెళ్లి ఎపుడు అనే ప్రశ్న వస్తుంది దాని గురించి బాలయ్య అడిగాడు. ఇక ప్రభాస్ లైఫ్ లో ఉన్న అమ్మాయి అంటూ రామ చరణ్ లీక్ ఇవ్వడం, పెళ్లి ఎపుడు అంటూ చర్చించడం ఇవన్నీ షో మీద హైప్ పెంచాయి. వీటికి ప్రభాస్ చెప్పే సమాధానం కూడా జనాలకు తెలిసినదే అయినా ఇంకా ఏముంటుందో అనే కూతుహలం ప్రేక్షకులలో పెంచారు ఈ షో ద్వారా అన్ స్టాపబుల్ టీం అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…