Senior Journalist Imandhi Ramarao : తెలుగులో ఎంతో మంది కమెడియన్లు పేరు తెచ్చుకున్నారు. అయితే పాతతరంలో రేలంగి, పద్మనాభం తదితరులు మంచి ప్రాచుర్యం పొందిన చలం గారి హాస్యం సరికొత్తగా ఉండేది. కేవీ చలం గారి హాస్యం మరీ అతిగా ఉండకుండా యాసలతోనే మంచి హాస్యం అందించి నవ్వించేవారు. చాలా మంది ఇప్పటి తరానికి కేవీ చలం గారు తెలియకపోవచ్చు. నాటకాల నుండి సినిమాల్లోకి అడుగుపెట్టిన కేవీ చలం తనదైనా భాష యాస తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా వారి భాష, రష్యన్, మలయాళం, బెంగాలీ ఇలాంటి భాషలు మాట్లాడేవారు. అయితే ఆయన ఆ భాషవరుస, తీరు సహజంగా పలకడం వల్ల అందరూ ఆ భాష వచ్చు అనే అనుకునేవారు . ఇక ఆంగ్లంను కూడా తెలుగులా మాట్లాడటం, చెన్నైలో ఉన్న తెలుగు మాట్లాడే భాష ఇలా అన్ని యాసలను వాడి నవ్వుతేప్పించేవారు అయితే ఆయన మరణం అందరికి షాక్ ఇచ్చింది . ఆయన గురించిన విశేషాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పంచుకున్నారు.
రైలు కింద పడి మరణించారు…..
ఇమంది గారు చలం గారి గురించి చెబుతూ ఆయన హాస్యాన్ని సహజంగా పండించేవారు అంటూ పేర్కొన్నారు. సెట్స్ లో ఉన్నా సరదాగా అందరిని నవ్విస్తూ ఉండేవారు అంటూ చెప్పారు. ఇక హరిశ్చంద్ర ద్వారా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తేనెమనసులు, సర్కస్ రాముడు, చిల్లరకోట్టు చిట్టెమ్మ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు అంటూ చెప్పారు. ఇక ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒక రోజు సడెన్ గా రైలు పట్టాలమీద శవమై కనిపించడం తో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది.
ఎవరో తలా మీద కొట్టి చంపిచాపలో చుట్టి రైలు పట్టాలమీద పడేసారు. ఎవరు చంపారో ఇప్పటికీ తెలియదు. ఎవరిని అంత దగ్గరగా రానివ్వని శోభన్ బాబు గారు చలం తో చాలా స్నేహంగా ఉండేవారు. చలం మరణ వార్త వినగానే ఆయన షాక్ అయ్యారు. బయటకు ఎక్కువ రాని శోభన్ బాబుగారు చలం గారి అంత్యక్రియలలో పాల్గొని చివరి దాకా ఉన్నారు. ఆయన చనిపోయిన రెండు రోజులకు కానీ ఎవరికీ తెలియలేదు అంటూ చలం గారి గురించి ఇమంది గారు ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…