Featured

Senior Journalist Imandhi Ramarao : ప్రేమించిన అతడి పేరునే తన పేరుగా మార్చుకున్న… చివరికి చితికి కూడా డబ్బు లేని పరిస్థితి : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : తెలుగులో కమెడియన్ గా గుర్తింపు పొందిన నటిమణుల్లో కల్పన రాయ్ ఒకరు. కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన కల్పన రాయ్ నటిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి కల్పన గారి గురించి చాలా విషయాలు అందరికీ తెలియవు. ఇక ఆమె సొంతూరు కాకినాడ కాగా కల్పన గారికి సినిమాల మీద ఉన్న ఆసక్తి కారణంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ధనిక కుటుంబం నుండి వచ్చిన కల్పన గారు సినిమాల్లోకి వచ్చి సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ, చివరికి మరణించే సమయానికి ఆమె ఆర్థిక ఇబ్బందులతో మరణించింది.

ప్రేమించిన వాడి పేరునే తన పేరుగా మార్చుకున్న కల్పన…

కల్పన రాయ్ గురించిన ఆసక్తికర విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పంచుకున్నారు. కల్పన గారి అసలు పేరు సత్యవతి కాగా సినిమాల్లోకి వచ్చాక కల్పన గా మార్చుకున్నారు. ఇక తన సొంతూరు కాకినాడ కాగా అక్కడ ప్రేమించిన వ్యక్తి మోహన్ రాయ్ పేరునే తన పేరుగా మార్చి కల్పన రాయ్ గా మార్చుకున్నారు. ఇక హీరోయిన్ శారద అంటే ఎంతో అభిమానం ఉన్న కల్పన గారు ఆమెతో మంచి స్నేహం, సన్నిహిత్యం కూడా ఉండటంతో ఆమె సలహాలు మేరకు సినిమాల్లో అడుగుపెట్టింది. ఇక సినిమాల్లో కోడి రామకృష్ణ గారు, వెంకటేష్ గారు ఎక్కువగా అవకాశాలు ఇచ్చి ఆదరించారట.

అయితే ఆమెకి ఒక కూతురు కాగా ఆమె ఇంట్లో నుండి వెళ్లిపోయి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కల్పన గారు బాగా క్రుంగిపోయారట. సినిమాల్లోకి రాక ముందు నుండి కూడా దాన ధర్మాలు ఎక్కువ చేసే అలవాటు ఉన్న కల్పన గారు అలా వచ్చిన డబ్బాంత పొదుపు చేసుకోకుండా ఖర్చు చేయడం, అందరికీ దానం చేయడం వల్ల చివరికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకవైపు డైయాబేటీస్ ఉండటం వల్ల పట్టించుకోక ఆరోగ్యం క్షీణించి మరణించే సమయంలో చూసుకునే వారు లేక ఒంటరిగా మిగిలిపోయారు. ఇక అంత్యక్రియలకు కూడా డబ్బు లేక సినిమా ఇండస్ట్రీ నుండి కొంతమంది ముందుకు వచ్చి అంత్యక్రియలు చేయడం దురదృష్టం అంటూ ఆమె గురించి ఇమంది గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

11 minutes ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

23 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

38 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

48 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

1 hour ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

1 hour ago