కరోనా మహమ్మారి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ మరణ మృదంగం మ్రోగిస్తోంది. ఏరోజుకారోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ లాక్ డౌన్ సడలింపులతో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తనను కరోనా కాటేసిందని స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబందించిన ఓ వీడియోను విడుదల చేశారు బాలుగారు.
ఆ వీడియోలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, జ్వరంతో పాటు దగ్గుతో కూడా బాధ పడుతున్నానని, దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, శ్రేయోభిలాషులకు విన్నవిస్తూ.. ఎలాంటీ ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు. దయచేసి ఎవరూ ఫోన్లు చేయవద్దని కోరారు. గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారు త్వరలో కోలుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో మళ్లీ మనముందు మంచిమంచి కార్యక్రమాలు నిర్వహించాలని భగవంతుని కోరుకుందాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…