Serial Actress Priyanka Jain : సినిమాల్లో హీరోయిన్స్ కంటే సీరియల్స్ లో నటించే వారికీ అభిమానులు ఎక్కువ ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు వారిని ఎక్కువ అదరిస్తారు, అభిమానిస్తారు. మన ఫేవరెట్ సీరియల్ లో హీరో హీరోయిన్ అంటే నిజంగానే వాళ్ళు సీరియల్ లో లాగ అంత అమాయకంగా మంచిగా ఉంటారని భావించే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అలానే మా టీవీ లో ప్రసారమయిన ఒక్కప్పటి టాప్ సీరియల్ మౌన రాగం, ఆ సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్. ఆ సీరియల్ లో మూగ అమ్మాయి పాత్రలో నటించిన ఆమె ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. ఆ సీరియల్ తరువాత వచ్చిన జానకి కలగనలేదు సీరియల్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అప్పుడు ప్రియాంక వేరు ఇప్పుడు ప్రియాంక వేరు అన్నట్లుగా మారిపోయింది. లంగావోణీ లో తెలుగుమ్మాయిలా కనిపించిన ప్రియాంక ప్రస్తుతం గ్లామర్ షో తో హద్దులు దాటతున్న వైనం సగటు తెలుగు ప్రేక్షకుడికి నచ్చడం లేదు.
సహజీవనం…. ఎక్సపోసింగ్….
మహారాష్ట్రలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రియాంక మోడలింగ్ నుండి సినిమాల్లోకి అక్కడ కలిసిరాక సీరియల్స్ లోకి వచ్చింది మొదట్లో సీరియల్స్ లో నటించేప్పుడు బాగానే ఉన్న ప్రియాంక జైన్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాక రూటు మార్చింది. బిగ్ బాస్ స్టార్టింగ్ లో కూడా ఆమెను అభిమానించిన ప్రేక్షకులు రాను రాను ప్రియాంక మాటలు అందరి మీద నోరు పారేసుకోవడం, ఊసరవెల్లిలా రంగులు మార్చడం చూసి జనాలకు నచ్చలేదు. ఇక బిగ్ బాస్ తరువాత ఆమెకు వచ్చిన నెగెటివిటీ కారణంగా సీరియల్స్ లో అవకాశాలు దూరమాయ్యాయి. టీవీ షోస్ ను నమ్ముకున్న ప్రియాంక ఇక డ్రెసింగ్ అంత మార్చేసి ఒకవైపు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మరోవైపు షోస్ లో రెచ్చిపోయి ఎక్సపోసింగ్ చేస్తోంది. తాజాగా ఆహా ఓటిటి లో ప్రసారమయ్యే డాన్స్ ఐకాన్ షో లో ప్రియాంక పొట్టి గౌన్ చూసి అందరూ షాక్ అయ్యారు.
ఇక ప్రియాంక వ్యకగత జీవితం చూస్తే ముంబై లో పుట్టి పెరిగిన ఆమె డిగ్రీ చదివేటపుడు ఒకరితో ప్రేమలో పడింది. అయితే మోడలింగ్ చేస్తూ చదువుకుంటున్న ఆమెతో విబేధాలు వచ్చి బాయ్ ఫ్రెండ్ తో విడిపోయింది. ఇక కన్నడ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె టాలీవుడ్ వైపు చూడగా ఒక సినిమాలో చేసిన పెద్దగా కలిసి రాలేదు. ఇక మౌనరాగం సీరియల్ లో తనతో లీడ్ రోల్ చేసిన శివ తో ప్రేమలో పడిన ఆమె సహజీవనం చేస్తోంది. పబ్లిక్ గా ఈ విషయం చెప్పి ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రాంక్ వీడియోస్ అంటూ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మొన్నామధ్య తిరుమల లో ఇలానే పులి అంటూ ప్రాంక్ చేసి పోలీసుల చేత మొట్టికాయలు కూడా వేయించుకున్నారు. ఇలా ప్రియాంక రాను రాను తన అభిమానులకు దూరమవుతు ఆఫర్స్ కోసం నేనమైనా చేస్తా అన్నట్లుగా బెహేవ్ చేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…