Featured

Jr NTR: ఆర్టిస్ట్ గా కూడా పనికి రాదు గాని, ఎన్టీఆర్ ను కించపరుస్తుందా…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

Jr NTR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఇటీవలే విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. రోజుకో రికార్డుతో బాక్సాఫీసును బద్దలు కొడుతూ అశేష అభిమానాన్ని చూరగొంది. దీంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పై రోజు రోజుకి ప్రశంసలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్థాయిలో వారికి అభిమానులు కూడా పెరుగుతూనే ఉన్నారు. దీంతో ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Jr NTR: ఆర్టిస్ట్ గా కూడా పనికి రాదు గాని, ఎన్టీఆర్ ను కించపరుస్తుందా…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్.ఆర్ ఆర్ కనిపిస్తుంది బాక్సాఫీస్ ను షేక్ చేసి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి టాలీవుడ్ సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళింది ఈ చిత్రం. కొమరం భీమ్, అల్లూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముందు నుంచే భారీ అంచనాలు ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. దానికి తగ్గట్టుగానే రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ మామూలు ప్రేక్షకుడిని సైతం కట్టిపడేసిందంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా ఈ సినిమా పై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.

Jr NTR: ఆర్టిస్ట్ గా కూడా పనికి రాదు గాని, ఎన్టీఆర్ ను కించపరుస్తుందా…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు మీరాచోప్రా. కెరీర్ ప్రారంభంలో వాన, బంగారం లాంటి చిత్రాలతో తళుకుమన్నా, ప్రస్తుతం అరకొర అవకాశాలతో నెట్టుకొస్తోంది ఈ భామ. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై స్పందించిన మీరా చోప్రా, కేవలం రామ్ చరణ్ పేరును మాత్రమే ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ అభిమానులను అసంతృప్తికి గురి చేసింది.

ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్…

సౌత్ ఇండియా హీరోలు చాలా ఎత్తుకు ఎదుగుతున్నారని పొగుడుతూ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యశ్ పేర్లను హాష్ ట్యాగ్ తో జత చేసింది. కానీ ఎక్కడా కూడా ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కథానాయికలు సైతం ఎన్టీఆర్ తో నటించాలని ఓపక్క ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా పనికిరాని మీరాచోప్రా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కోల్పోయిన ఈ భామ, అప్పటి నుంచే తారక్ పై ఇలా నెగటివ్ స్ప్రెడ్ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

18 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

18 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

18 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

18 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

19 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

21 hours ago