Featured

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

Sai Pallavi-Shekhar kammula: శేఖర్ కమ్ముల.. దర్శకత్వంలో తన మార్క్ ను చూపిస్తాడు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల కష్టాలు.. సుఖాలు.. ప్రేమలు ఎలా ఉంటాయో ‘హ్యాపీ డేస్’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రస్తుతం చదువుతున్న.. చదవబోయే ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా.. ఈ సినిమాను మర్చిపోలేడు. అంతలా అద్భుతంగా తీశాడు.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ యాసలో వచ్చి.. బంపర్ మెజారిటీ హిట్ సాధించిన మరో చిత్రం ఫిదా. దీనిలో భాను .. హైబ్రిడ్ పిల్ల అంటూ అందరినీ మెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి. దీనిలో సాయి పల్లవి తన నటన పరంగా మంచి గర్తింపు తెచ్చుకుంది . తెలంగాణ యాసను అద్భుతంగా పలికింది.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

తర్వాత లవ్ స్టోరీ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. దీనిలో కూడా ఆమె అందం, అభినయం, డ్యాన్స్ లతో మరోసారి అలరించింది. ఇక లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల తమిళ నటుడు ధనుష్ తో ఓ సినిమా తీయబోతున్నాడు.

దీనిని తెలుగు, తమిళంలో తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏషియన్ గ్రూప్ ఆఫ్ సినిమాస్ యూనిట్ అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తే.. ఆమె పాన్ ఇండియాలో అడుగు పెట్టినట్లు అవుతుంది.


సాయి పల్లవిని పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..

మొన్నటి వరకు కూడా ఇలానే జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ సారి ధనుష్ నటించే ఈ సినిమాలో సాయి పల్లవిపై శేఖర్ కమ్ముల ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కాకుండా.. బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ధనూష్ సరసన నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ధనుష్ నటించిన జగమే తంధీరమ్ విడుదల ఒక సంవత్సరం పాటు ఆలస్యం అయింది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, సంచనా నటరాజన్, దీపక్ పరమేష్ తదితరులు నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago