శివ జ్యోతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా, బిగ్ బాస్ ద్వారా, న్యూస్ ప్రెజెంటర్ గా అందరికీ సుపరిచితమే. తెలంగాణ యాసతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శివజ్యోతి కెరియర్ మొదట్లో హైదరాబాద్ కి వచ్చి ఎన్నో కష్టాలను అనుభవించారు.
ఈ క్రమంలోనే ఆమె గంగోలి అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలు కాదన్న తనని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఏకంగా హైదరాబాద్ లో సొంత ఫ్లాట్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఈ విధంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నిత్యం ప్రేక్షకులను సందడి చేస్తున్న శివ జ్యోతి తాజాగా సూపర్ క్వీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటికే ఈమె ఎన్నో వేదికలపై తన ప్రేమ గురించి తన భర్త గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే సూపర్ క్వీన్ కార్యక్రమం ద్వారా శివ జ్యోతి మరొకసారి తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు గొప్పదని అయితే వారు చూపించే ప్రేమ అప్పుడు నాకు అర్థం కాలేదు.
కానీ ఇప్పుడు తాము తల్లిదండ్రులు కావాలని భావించుకున్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలుస్తోందని ఈమె ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు సమక్షంలో పెళ్ళి జరిగిన ఆ పెళ్లి సక్సెస్ అవుతుందని ప్రేమించి పెళ్లి చేసుకున్నవన్నీ ఫెయిల్యూర్ అవుతాయని నమ్మకం లేదు ఏదైనా కానీ మనం సర్దుకుపోయే విషయంలో ఉంటుంది అంటూ తన భర్త తనకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ శివజ్యోతి ఎమోషన్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…