ఎక్కడైనా శివలింగం పెరగడం చూశారా.. లేదా విన్నారా.. అయితే ఇప్పుడు మీరు వినే మాట నిజమే. అక్కడ నిజంగానే శివలింగం పెరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్న ధాన్యం గింజ పరిమాణంలో ప్రతీ సంవత్సరం పెరుగుతుంది. ఇది అక్కడి భక్తులు కూడా స్వయంగా చప్పే మాట. ఇది శ్రీకాకులంలోని టెక్కలి మండలం రావివలస గ్రామంలో భారీ శివలింగం కొలువై ఉంది.
ఆ శివాలయాన్నే ఎండల మల్లిఖార్జున స్వామి అని పిలుస్తారు. పురాణాల్లో దీనిని సీతారాములు పూజాధికాలు నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడి శివలింగానికి దేవతలే ఆలయాన్ని కట్టినా అది నిలువలేదు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉండటం వల్ల ఆలయాన్ని ఎండల మల్లికార్జున స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. పూర్వం దీనికి శ్రీకాకులం జిల్లాకు దగ్గర్లో ఉన్న ఒడిషా భక్తులు ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకున్నారంట.
కానీ ప్రతీ ఏడాది శివలింగం పెరుగుతుండటంతో వారు ఆలయం కట్టడం విరమించుకున్నారంట. కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగాయని.. శివభగవానుడి దయవల్ల పుట్టిన ఆ పిల్లలకు మల్లన్న, మల్లమ్మా అని పేర్లు పెట్టుకోవడం కూడా జరిగిందని ఇక్కడి అర్చకులు చెబుతారు.
పర్యాటక శాఖ దేవాలయాల పర్యాటకంలో భాగంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఆలయం అభివృద్ధితో పాటు ఆదాయం పెరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. ఎండల మల్లికార్జున స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి భక్తులు రావడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…