Shiva-Priyanka Jain: ఈరోజు టీవీల్లో వస్తున్న సీరియళ్లు కూడా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ సంపాదించుకున్నాయి. అందులో నటులు కూడా ప్రతీ ఇళ్లలో మనుషులుగా మారారు. సాయంత్రం అయితే సీరియళ్లు నడవని ఇళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు సీరియళ్లు లేనిదే పొద్దు పోని పరిస్థితి కూడా ఉంది.
ఇదిలా ఉంటే.. సీరియల్ లైఫ్ లో జోడీగా నటించే వ్యక్తులు నిజ జీవితంలో కూడా ఒకటి కావడం మనం చూస్తూనే ఉన్నాం. నిజజీవితంలో పెళ్లిలు కూడా చేసుకున్నారు. సీరియళ్లలో నటించే సమయంలో పెరిగిన పరిచయం ప్రేమగా మారి.. పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా మౌనరాగం సీరియల్ ద్వారా అమ్ములు, అంకిత్ పాత్రల్లో ఆకట్టుకున్నారు ప్రియాంక జైన్, శివకుమార్.
అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివ కుమార్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘ఇంటికి దీపం ఇల్లాలు’ సీరియల్ లో నటించగా… ప్రియాంక జైన్ ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో నటిస్తున్నారు.
ప్రస్తుతం స్టార్ మా టీవీలో పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు వీరిద్దరు. లవ్ లో ఉన్న వీరిద్దరు తరుచూ దేవాలయాలకు వెళుతూ.. ఫోటోలను షేర్ చేస్తుంటారు. సీరియళ్లలో నటిస్తున్న వీరిద్దరికి బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ.. నా జీవితంలో అమ్మ, నాన్న, ఒక జైన్ అమ్మాయి మాత్రమే ఉందంటూ కామెంట్ చేశాడు. ఇలా వీరిద్దరి మ్యాటర్ బయటకు రావడంతో నెటిజెన్లు కూడా స్పందిస్తున్నారు. అయితే ఒకరు మాత్రం … శివకుమార్ చాలా ఓవర్ చేస్తున్నాడు, మీరు వెంటనే తనకు బ్రేకప్ చెప్పండి అంటూ ప్రియాంక జైన్ కు సలహా ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…