శ్రియ సరన్ పరిచయం అవసరం లేని పేరు.. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ స్టార్ గా వెలిగిన కథానాయిక. లేటు వయసులో కూడా అందాల ఆరబోతలో కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనే ఇస్తోంది. ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గినా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అడపాదడపా కొన్ని సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. అయితే అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే ఆండ్రీ అనే రష్యన్ కుర్రాడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉండటంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
తాజగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు నడుంకట్టింది శ్రియ శరన్. ఒక స్వచ్చంద సంస్థతో కలిసి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. కేవలం 200 రూపాయిలు చెల్లించి తనతో యోగ మరియు డాన్స్ చేయొచ్చు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ హాట్ హీరోయిన్. అయితే శనివారం సాయంత్రం 8గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉన్నట్టు తెలిపింది. కరోనా బాధితుల కోసం “ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్” అనే స్వచ్చంద సంస్థలతో కలిసి విరాళాలు సేకరిస్తున్నారు తెలిపింది శ్రియ. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం ఈ విరాళాలు సేకరిస్తున్నారు తెలిపింది. ఈ క్రమంలో తనతో డాన్స్ చేయాలంటే http://www.thekindnessproject.in అనే వెబ్సైటు లో 200 రూపాయిలు చెల్లించి ఆ రశీదును give@thekindnessproject.in
కు ఇమెయిల్ చేయాలని పేర్కొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…