Shruthi Hassan: శృతిహాసన్ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ తన సినిమా పనులలో తాను బిజీగా ఉంటారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఈ ఏడాది మొదట్లో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి శృతిహాసన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే మరో సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శృతిహాసన్ ప్రభాస్ కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ముఖ్యంగా తన ప్రియుడికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ శృతిహాసన్ ఇలాంటి పోస్ట్ చేయడంతో అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈమె చేసిన పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…
నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. వారు గోతులు తీస్తూ ఉంటారు కానీ వారు తీసిన గోతిలో వారే పడుతుంటారు. నేను ఇలాంటివి గమనిస్తూ ఏమి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోతుంటాను అయితే కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుందని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసినటువంటి నెటిజన్స్ అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు ఎవరికి ఇలా కౌంటర్ ఇచ్చారన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఈమె ఎవరి గురించి చెప్పిందో తెలియాలి అంటే శృతిహాసన్ స్పందించాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…