Shruthi Hassan: లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శృతిహాసన్. ఇలా ఈమె మొదట హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగులో మాత్రం అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో అందరూ తనని ఐరన్ లెగ్ అంటూ కామెంట్ చేశారు. అయితే పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయినా శృతిహాసన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా గబ్బర్ సింగ్ సినిమా అనంతరం ఈమె పలు వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి శృతిహాసన్ తిరిగి క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
శృతిహాసన్ తన సినిమా కెరియర్ గురించి కొన్ని విషయాలను తెలియజేశారు తాను హిందీ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టానని అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా తన కెరీర్ పూర్తిగా మార్చిందని తెలిపారు. ఇండస్ట్రీలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు గల కారణం పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ సినిమానే కారణమంటూ శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…