Akhil: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీ అఖిల్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తన మాజీ వదిన సమంత సైతం అఖిల్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే అఖిల్ అక్కినేని అంటూ ఈమె తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఏజెంట్ సినిమా గురించి కూడా ప్రమోట్ చేశారు.
ఈ క్రమంలోనే సమంత పోస్టుకు అఖిల్ రిప్లై ఇస్తారా ఇవ్వరా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే అఖిల్ తాజాగా సమంత చేసిన పోస్ట్ కు రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ సామ్… నీ అంచనాలను అందుకుంటాను అనుకుంటున్న అంటూ కామెంట్ పెట్టడమే కాకుండా హార్ట్ సింబల్స్ షేర్ చేశారు. ప్రస్తుతం అఖిల్ సమంత పోస్టుకు రిప్లై ఇవ్వడంతో సమంత అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నప్పటికీ అతని కుటుంబంతో మాత్రం ఇంకా సన్నిహితంగా మెలుగుతుందని తెలుస్తోంది. నాగచైతన్యకు దూరంగా ఉన్నా అక్కినేని కుటుంబ సభ్యులతో ఈమె చనువుగా ఉందని చెప్పాలి. ఇక సమంత కూడా ఈ నెల 14వ తేదీ శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…