Featured

Shubhaleka Sudhakar : అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఎంత గొడవ చేశాడంటే…: శుభలేక సుధాకర్

Shubhaleka Sudhakar : ‘శుభలేఖ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా పెట్టుకున్న శుభలేఖ సుధాకర్ చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్పి బాలసుబ్రమణ్యం చెల్లెలు ప్లే బ్యాక్ సింగర్ ఎస్పి శైలజ ను 1989 లో వివాహం చేసుకున్నారు. అనకాపల్లికి చెందిన సుధాకర్ మద్రాస్ వెళ్లి తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలకోసం ఆడిషన్ ఇచ్చారు. ఇక శుభలేఖ సినిమాలో విశ్వనాధ్ గారు మొదట ఆఫర్ ఇచ్చినా తమిళ సినిమా ‘తునయ్’ ముందు విడుదలైంది.

అరవింద సమేత షూటింగ్ లో ఎన్టీఆర్…

శుభలేక సుధాకర్ గారు సీనియర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలను చేస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అప్పటి హీరోలతోనే కాకుండా నేటి హీరోలతో కూడా నటిస్తున్న సుధాకర్ గారు ఇప్పటి హీరోలలో తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ మహేష్ బాబు బాగా మాట్లాడుతారని అయితే చాలా బాలన్స్డ్ గా ఉంటాడంటూ చెప్పారు.

ఇక ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ లో నటించిన సుధాకర్ గారు ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనే విషయం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ సెట్స్ లో చాలా అల్లరి చేస్తాడు. ఎంత హైపర్ ఎనర్జీ ఉంటుందో, బాగా గొడవ చేస్తుంటాడు, అందరితో గోలగోలగా సందడిగా ఉంటుంది అయితే షాట్ రాగానే అలానే సీరియస్ గా తన వెర్షన్ చెప్పేస్తాడు. ప్రి క్లైమాక్స్ సీన్ చేస్తప్పుడు సెట్స్ లో అల్లరి చేస్తూ షాట్ రెడీ అవగానే సీరియస్ మోడ్ లో చేసేస్తాడు. ఆ డైలాగులు ఎపుడు నేర్చుకుని ఉంటాడో తెలియదు గుడ్ యాక్టర్ తను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago