గ్రీన్ఇండియా చాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు శ్యామ్ సింగరాయ్ టీమ్. హీరో నాని తో పాటు హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి కలసి పార్క్ లో మొక్కలు నాటారు.
వీరితో పాటు శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్ బోయిన పల్లి వెంకట్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని మొక్కలు నాటారు. దీనిలో భాగంగా నానీ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని నాని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. చుట్టు పక్కల పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని.. పర్యావరణంపై కూడా ఓ కన్ను వేసి ఉంచాలన్నారు.
మొక్కలు నాటి.. వాటని సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అంటూ సూచించాడు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.
సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. మొక్కలు నాటిన తరువాత గ్రీన్ ఇండియా ఈ వెంట్ కు సంబంధించిన బుక్ ను అందుకున్నారు శ్యామ్ సింగరాయ్ టీమ్. వృక్షవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి నిర్వాహకులు అందజేశారు.
వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ ను నాని, సాయి పల్లవి, కృతిశెట్టి అభినందించారు. ఆ చుట్టుపక్కల అంతా హడావిడిగా తయారయ్యింది. హీరో, హీరోయిన్లను చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు సినీ బృందం.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…