Siddharth : ‘బాయ్స్’ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సిద్ధార్థ ఆ తరువాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సిద్ధార్థ అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి డిజాస్టర్ తరువాత సిద్ధార్థ జోరు తెలుగులో తగ్గింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన సిద్ధు, ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
ప్రేమలో పడ్డ సిద్ధు… అధితి…
చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ సినిమా ‘మహా సముద్రం’ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా సిద్ధార్థ కు ఆ సినిమా బాగా ప్లస్ అవుతుందనుకుంటే నిరాశే మిగిల్చింది. అయితే ఆ సినిమాలో సిద్ధూకి జంటగా అధితి రావు హైదరీ నటించింది. ఇక సినిమాలో సిద్ధూ పాత్రకి దర్శకుడు న్యాయం చేయకపోయినా అధితి రావు, సిద్ధూ మధ్య రొమాన్స్ మాత్రం బాగా చూపించాడు. ఇక ఈ సినిమా తరువాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా అనుమానం రాకపోయినా ఇటీవల ముంబై లో ఒకే గదిలో నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపించాయి.
అది కాక ఫోటోలు తీసే సరికి మీడియా మీద ఫైర్ అయ్యాడు సిద్ధూ. ఇక సిద్ధూ కి ఇండస్ట్రీ కి వచ్చినపుడే పెళ్లయింది. ఇక భార్య తో వీడిపోయాక సమంత, శృతి హాసన్, హన్సిక వంటి హీరోయిన్స్ తో కొద్దికాలం డేట్ చేసాడు సిద్ధూ. ఇక మళ్ళీ అధితి తో కనిపించి వైరల్ అవుతున్నాడు సిద్ధూ. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ట్రైలర్ వేడుకలో అధితి తో కలిసి జంటగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక వేడుకలో ఇద్దరి ప్రవర్తన త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారా అన్నట్లుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి జిమ్ కి వెళ్ళడం, షాపింగ్ కలిసి చేయడం వంటివి చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలకు ఉప్పందిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…