Siddhartha : ‘బాయ్స్’ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సిద్ధార్థ ఆ తరువాత ‘యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సిద్ధార్థ అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే చుక్కల్లో చంద్రుడు వంటి డిజాస్టర్ తరువాత సిద్ధార్థ జోరు తెలుగులో తగ్గింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన సిద్ధు, ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
ప్రేమలో పడ్డ సిద్ధు..?
చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ సినిమా మహా సముద్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ కు ఆ సినిమా బాగా ప్లస్ అవుతుందనుకుంటే నిరాశే మిగిల్చింది. అయితే ఆ సినిమాలో సిద్ధూకి జంటగా అధితి రావు హైదరీ నటించింది. ఇక సినిమాలో సిద్ధూ పాత్రకి దర్శకుడు న్యాయం చేయకపోయినా అధితి రావు, సిద్ధూ మధ్య రొమాన్స్ మాత్రం బాగా చూపించాడు.
ఇక ఈసినిమా తరువాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా అనుమానం రాకపోయినా తాజాగా ముంబై లో ఒకే గదిలో నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కాక ఫోటోలు తీసే సరికి మీడియా మీద ఫైర్ అయ్యాడు సిద్ధూ. మరి నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారో లేక ఒట్టి రూమర్స్ మాత్రమేనా అనేది తెలియాలి. ఇక సిద్ధూ కి ఇండస్ట్రీ కి వచ్చినపుడే పెళ్లయింది. ఇక భార్య తో వీడిపోయాక సమంత తో కొద్దికాలం డేట్ చేసాడు సిద్ధూ. ప్రస్తుతం సిద్ధార్థ మళ్ళీ తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…