Singer Chinmayi: సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..! వారి భార్యలు గొప్పవాళ్లు అంటూ..!
Singer Chinmayi సింగర్ చిన్మయి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా డైరెక్టర్ సుధా కొంగరకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ స్త్రీ హక్కుల గురించి మాట్లాడే చిన్మయి మరో సారి ఇలాగే స్త్రీలకు మద్దతుగా నిలిచారు.
గతంలో కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు. తమిళ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులపై ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల సమంత విడాకుల వ్యవహారంలో కూడా సమంతకు మద్దతుగా నిలిచారు. డైరెక్టర్ సుధా కొంగర మనందరికి తెలిసిన వ్యక్తే. ఆకాశమే నీ హద్దురా, గురు సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు.
ఇదిలా ఉంటే ఇటవల తను పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఏ మీటింగ్ వెళ్లినా.. మీ భర్త చాలా గొప్పవారు ..మీకు నచ్చిన పని చేయనిస్తున్నారంటూ పలువురు అనేవారని…అలాంటి వారితో నేను గొడవకు దిగుతుంటాను. ఈ పని చేయడానికి నాకు ఎవరూ పర్మిషన్ గానీ అంగీకారాన్ని గానీ ఇవ్వలేదు.. నాకు నచ్చింది.. నేను చేస్తున్నాను అని సుధా కొంగర చెబుతుంటారట.
ప్రస్తుతం ఇవే వ్యాఖ్యలకు మద్దతుగా సింగర్ చిన్మయి సెటైరికల్ గా పలు వ్యాఖ్యలు చేశారు. స్త్రీల హక్కులు, వివక్ష ఎదురైనప్పుడు వెంటనే స్పందిస్తుంటారు చిన్మయి. తాజాగా చిన్మయి.. సుధా కొంగర వ్యాఖ్యలకు తన మరికొన్ని వ్యాఖ్యలను జోడించి మీరీ కౌంటర్ వేశారు. ‘‘సినిమా దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటీషియన్స్ భార్యలు నిజంగానే గ్రేట్’’.. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్చను, పర్మిషన్‌ను ఇచ్చారు అంటూ సెటైర్లు వేశారు. చిన్మయి చేసిన ఈ పోస్ట్ కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. మహిళలు చేసే పనిని కూడా గుర్తించాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…