Mangli: సెలబ్రిటీ హోదా వస్తే ఒక బాధ.. రాకపోతే మరో బాధ. ఎవరైనా సెలబ్రిటీ కావాలనే కోరుకుంటారు. దానికి తగ్గట్లు అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే తెలంగాణ జానపదం..షెడ్యూల్ తెగలు, లంబాడీలకు సంబంధించి పాటలను పాడటంతో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్న సింగర్ మంగ్లీ. తీన్మార్ లో ఒక జర్నలిస్ట్ గా ఆమె టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం.
తర్వాత సినిమాల్లో పాటలు పాడుతూ.. పండుగల నేపథ్యంలో .. ఆ పండుగ యొక్క కీర్తిని.. విశేషాలను పాటల రూపంలో ఆమె పాడుతూ.. మంగ్లీ అంటే ఏంటో నిరూపించుకుంది. అయితే ఆమె పాడే పాటల్లో లిరిక్స్ కు సంబంధించి కొన్ని పదాలు కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని చాలాసార్లు వివాదాల్లోకి కూడా వచ్చారు. ఇలా ఆమె పెద్ద సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. చిన్న చితకా సినిమాల్లో కూడా నటిస్తోంది.
అయితే తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే.. అయితే ఈ మధ్య సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కారణం కరోనా కాదు . అభిమానులు. అవును.. అభిమానుల కారణంగా సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్స్ కావడంతో అక్కడ సెల్ఫీలతో విసిగిపోతున్నారు.
అలాంటిదే తాజాగా సింగర్ మంగ్లీ విషయంలో కూడా ఇలానే జరిగింది. సెల్ఫీలతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆమె మంత్రి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వచ్చింది. దీంతో మంగ్లీతో సెల్ఫీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఫోటోల కోసం అభిమానులు ఒక్కసారిగా హంగామా చేయడంతో మంగ్లీ తట్టుకోలేకపోయింది. ఇక అక్కడి యువకుల తీరుతో మంగ్లీ కలవరపడింది. ఇదేం పద్దతి అని మండిపడింది. ఈ సెల్ఫీలతో ఇబ్బంది పడటం మంగ్లీ ఒక్కరే కాదు.. గతంలో చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరిగింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర కార్యక్రమాలకు వెళ్లిన అభిమానులు.. అక్కడకు వచ్చిన సెలబ్రిటీతో సెల్ఫీలను దిగాలనే ఆశతో ఉంటూ.. వచ్చిన సెలబ్రిటీకి అసహనం తెప్పిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మంగ్లీ వీడియో వైరల్ గా మారింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…