Featured

Singer Revanth : షోలో తన భార్యను పరిచయం చేసిన సింగర్ రేవంత్..!

లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ అలియాస్ రేవంత్. ప్లేబ్యాక్ సింగర్ రేవంత్ అంటే తెలియని వారు ఉండరు. అతని పాటలకు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. రేవంత్ తెలుగు, కన్నడ చిత్రాలకు దాదాపు 200 పాటలకు పైగా పాడారు. అంతేకాదు బాలివుడ్ లో కూడా తనదైన మార్క్ చూపించాడు రేవంత్. ఇక దేశవ్యాప్తంగా సింగర్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న షో.. ఇండియన్ ఐడల్ 9వ సీజన్ లో టైటిల్ గెలుచుకున్నాడు. బాహుబలి: ది బిగినింగ్ చిత్రంలోని ” మనోహరి” పాటకు గాను IIFA ఉత్సవాల్లో ఉత్తమ నేపథ్య గాయకునిగా స్టార్ మా మ్యూజిక్ అవార్డు ను అందుకున్నాడు.

ఇక తాజగా జీ తెలుగులో సరిగమప సింగింగ్ కాంపిటీషన్ లో మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు రేవంత్. అయితే ఈ షోలో తన భార్యను పరిచయం చేసాడు సింగర్ రేవంత్. ఉగాది సందర్బంగా ఒక ప్రత్యెక కార్యక్రమాన్ని నిర్వహించారు షో నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి అతని భార్యను తీసుకొచ్చాడు. ఫిబ్రవరి నెలలో గుంటూరుకు చెందినా అన్విత గంగరాజు అనే యువతిని రేవంత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజగా ఈ కార్యక్రమంలో “ఈవిడ నా భార్య అన్విత” అంటూ సిగ్గు పడుతూ పరిచయం చేసాడు. తాజాగా ఆ కార్యక్రమం ప్రోమో విడుదల చేసారు. దీనీతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago