Featured

Radhika – Nirosha : రాధిక, నిరోష.. ఈ అక్క చెల్లెలితో జోడి కట్టిన ఏకైక స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా..?!

‌1978 మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసిన సంవత్సరం. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతికుమార్ ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేసిన క్రాంతి కుమార్. ఆయన తిరిగి చిరంజీవితో మరొక సినిమాను రూపొందించడానికి సంసిద్ధులు అయ్యారు. క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘న్యాయం కావాలి’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాధిక, చిరంజీవి హీరో, హీరోయిన్లుగా నటించారు.

చిరంజీవి- కోదండరామిరెడ్డి, చిరంజీవి-రాధిక ఇలా అందరూ కూడా మొదటి కలయిక. ఈ సినిమాతో ప్రారంభమైన చిరంజీవి, రాధిక కాంబో.. 1990 వరకు నిరాటంకంగా కొనసాగింది. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, ప్రేమ పిచ్చోళ్ళు, శివుడు శివుడు శివుడు, పులి బెబ్బులి, అభిలాష, గూడచారి నెంబర్ వన్, ఊరికి మొనగాడు, ప్రియ, ఇది పెళ్లంటారా, జ్వాల, మొండిఘటం, యమకింకరుడు, హీరో, దొంగ మొగుడు, రాజవిక్రమార్క లాంటి ఎన్నో చిత్రాల్లో చిరంజీవి రాధిక కలిసి నటించారు. ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన న్యాయం కావాలి, అభిలాష చిత్రాలలో ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ ను దగ్గర చేయగా.. మరొక చిత్రం యూత్ ను అట్రాక్ట్ చేయడం జరిగింది.

అయితే ఎన్టీ రామారావు రాధికతో “వయ్యారి భామలు వగలమారి భర్తలు” సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఆమెతో నేరుగా జోడి కట్టలేదు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి నటించారు…అక్కినేని నాగేశ్వరరావు రాధికతో అనుబంధం, ఇల్లాలే దేవత సినిమాలో నటించారు… శోభన్ బాబు రాధికతో కార్తీక పౌర్ణమి, బంధం, ఉమ్మడి మొగుడు చిత్రాల్లో నటించారు… సూపర్ స్టార్ కృష్ణ రాధికతో శాంతి నివాసం సినిమాలో నటించారు. రాధిక చెల్లెలు నిరోషతో కృష్ట “పచ్చని సంసారం” చిత్రంలో నటించినప్పటికీ ఆమెకు జోడీగా చేయలేదు.

1988 మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నిరోష మహాజనానికి మరదలు పిల్ల, బుజ్జిగాడు బాబాయ్, నారి నారి నడుమ మురారి, మధురానగరిలో, అతిరథుడు, అసాధ్యులు, కొబ్బరి బొండం, భలే ఖైదీలు, వన్ బై టూ లాంటి చిత్రాల్లో నటించారు. ఇకపోతే చిరంజీవి రాధికతో దాదాపు పది సంవత్సరాలు అనేక చిత్రాల్లో జోడిగా నటించారు. 1991 క్రియేటివ్ కమర్షియల్స్, కె.ఎస్.రామారావు నిర్మాణం, యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘ స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ విడుదలయింది. ఈ సినిమాలో చిరంజీవి విజయశాంతి, నిరోషా హీరో హీరోయిన్లుగా నటించారు. రాధిక, నిరోషా అక్క చెల్లెల్లతో పాటుగా… ప్రముఖ కథానాయిక లైన నగ్మా, జ్యోతిక, రోషిని ఈ అక్క చెల్లెల్లతో నటించిన ఏకైక తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి కావడం మరో విశేషం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago