Singer Revanth: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా వెళ్లిన సింగర్ రేవంత్ ఈ కార్యక్రమం మొదటినుంచి ఎంతో అద్భుతమైన ఆట తీరును కనపడుతూ ఎలాగైనా కప్పు గెలవాలన్న ఉద్దేశంతో తీవ్రస్థాయిలో పోటీపడి చివరికి తాను అనుకున్న విజయాన్ని అందుకున్నారు. ఇక రేవంత్ బిగ్బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి వెళ్లే సమయానికి తన భార్య అన్విత ఆరు నెలల గర్భిణీ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఆయన హౌస్ లోకి వెళ్లే ముందు తన భార్యను వేదిక పైకి కూడా నాగార్జున తీసుకువచ్చారు. ఈ విధంగా రేవంత్ హౌస్ లో ఉన్నప్పుడే అన్విత సీమంతపు వేడుకలు ఘనంగా జరిగాయి. అన్వితకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని బిగ్ బాస్ రేవంత్ కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఇక ఈ విషయాన్ని బిగ్ బాస్ రేవంతకు తెలియజేయడమే కాకుండా తన కూతురి ఫోటోని కూడా చూపించడంతో హౌస్ లో ఉన్నప్పుడే రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యారు.అయితే తన కూతురి ఫేస్ సరిగా కనిపించలేదని ఒకానొక సమయంలో రేవంత్ కాస్త నిరాశ కూడా వ్యక్తం చేశారు. ఇక ఈయన ఊహించిన విధంగానే కప్పు గెలిచి ఇంటికి వెళ్ళగా తన కుటుంబ సభ్యులు రేవంత్ కళ్ళకు గంతులు కట్టి తన కూతురిని తన చేతిలో పెట్టారు.
ఇలా కూతురిని చూసినటువంటి రేవంత్ ఒకసారిగా ఎమోషనల్ అవుతూ తన కూతురిని ముద్దాడారు. తనకు బిగ్ బాస్ టాపిక్ గెలుచుకున్న దాని కన్నా తన కూతురిని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎక్కువ ఆనందం కలిగిందని తెలుస్తోంది. ఇలా కూతురినీచేతులలోకి తీసుకున్నటువంటి రేవంత్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…