Categories: FeaturedMovie News

Singer Smitha : బిగ్ బాస్ ప్రోగ్రాంపై సంచలన వ్యాఖ్యలు… నేను చచ్చినా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళను : స్మిత

Singer Smitha : తెలుగులో మొదట తెలుగు పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించిన స్మిత, ఈటీవీ లో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా స్మిత రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ‘ఇషా’ సంస్థ లో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది. వీటితో పాటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అయితే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ప్రోగ్రాంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

ఈ కార్యక్రమం అంటే నాకు ఏమాత్రం నచ్చదు…

అయిదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరవ సీజన్ కూడా ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఈసారి 21 మంది కొంటెస్టెంట్లు వెళ్లారు. అయితే మొన్నటి వరకు ఈ లిస్టులో సింగర్ స్మిత పేరుకూడా వినిపించింది. అయితే ఈ విషయమే స్మిత ను అడుగగా బిగ్ బాస్ కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బిగ్ బాస్ హౌస్ కి చచ్చినా వెళ్ళను అని చెప్పేసారు.

నేను వెళ్లకపోవడమే కాదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నా వద్దు అని సలహా ఇస్తాను అని చెప్పింది. నాకు అసలు ఆ ప్రోగ్రాం అంటేనే నచ్చదు. బాగా కొట్టుకోండి అని అందరినీ లోపలకు పంపించి తాళం వేయడం ఏమిటో అసలు. వెళ్లే వారిని నేను విమర్శించట్లేదు కానీ నేను అయితే వెళ్ళను అని చెప్పేసింది. ఇలా తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేసారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago