Singer Sumangali : ‘నువ్వు నువ్వు నువ్వే నువ్వు’ సాంగ్ తో ఒక్కసారిగా సింగర్ సుమంగళి పేరు తెలుగులో మారు మోగిపోయింది. తమిళనాడు కి చెందిన సుమంగళకి తమిళంలోనే తన కెరీర్ మొదలు పెట్టినా దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమా ‘దేవి’ లో ‘నీ నవ్వే నాగ స్వరమే’ అనే సాంగ్ తో తెలుగులో అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత వచ్చిన నవ్వుతూ బతకాలిరా, ఖడ్గం, బొమ్మరిల్లు, వర్షం ఇలా వరుసగా తెలుగులో మెలోడీస్ పాడి టాప్ సింగర్ అయింది సుమంగళి. అయితే ప్రస్తుతం సింగింగ్ కి గుడ్ బై చెప్పి అమెరికాలో ఉంటున్న సుమంగళి రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ అలాగే కెరీర్ కి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

పెళ్ళికి ముందు భర్త పెట్టిన కండిషన్స్…
పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయిన సుమంగళి తన లైఫ్, కెరీర్ గురించి మాట్లాడుతూ అమ్మ నాన్న ఇద్దరికీ సంగీతం వచ్చినా ప్రొఫెషనల్ సింగర్స్ కాదని సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదంటూ తెలిపారు. అయినా కూడా నేను సింగర్ అవుతాను సినిమా పాటలు పాడుతానని చెప్తే ఒప్పుకున్నారు. ఏ రోజు అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అయితే లేట్ నైట్ రికార్డింగ్స్ ఉన్నపుడు మాత్రం వద్దు పగటి పూట వెళ్లి పనిచేయి అని చెప్పేవాళ్ళు. ఈ ఒక్క విషయంలోనే వాళ్ళు రెస్టిక్షన్స్ పెట్టారు అంటూ చెప్పారు సుమంగళి. ఇక పెళ్లి పెద్దలు కుదుర్చినదే అయినా హైదరాబాద్ లో ఎక్కువ సినిమాలకు పాటలు పాడటంతో పెళ్లి ఫిక్స్ అయినపుడు నా భర్త అక్కడే పనిచేయడం వల్ల అప్పుడప్పుడు కాఫి షాప్స్, రెస్టారెంట్స్ లో మీట్ అయ్యేవాళ్ళం.

అయితే ఆ సమయంలో ఆటోగ్రాఫ్ అంటూ ఫోటో అంటూ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. దీంతో మా ఆయన నాకు ఒక కండిషన్ పెట్టారు. నువ్వు సాంగ్స్ పాడు, ప్రోగ్రామ్స్ ఇవ్వు నాకేమి అభ్యంతరం లేదు కానీ ఈవెంట్స్ కి ప్రోగ్రామ్స్ కి నన్ను మాత్రం పిలవద్దు అంటూ చెప్పారట. సిమంగళి గారి భర్త ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ గా ఆపిల్ కంపెనీలో పనిచేస్తున్నారట. ఇక ఆమె తన కెరీర్ కు గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ మ్యూజిక్ మీదనే వర్క్ చేస్తున్నానని సాంగ్స్ పాడటానికి ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటానని తెలిపారు సుమంగళి.