Singer sunitha: సింగర్ సునీత పరిచయం అవసరం లేని పేరు ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఈమె కుమారుడు ఆకాష్ సర్కారు నౌకరి అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని 2021 జనవరి 9వ తేదీ కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో రెండవ వివాహం చేసుకున్నారు అయితే ఈమె రెండో వివాహ సమయంలో తన పట్ల పలు విమర్శలు కూడా వచ్చాయి.
ఇక సునీత వాటన్నింటినీ లెక్క చేయకుండా రెండో వివాహం చేసుకొని ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె ఇటీవల మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మూడో పెళ్లి రోజు..
నా జీవితంలో ఆ క్షణం ఎంతో అద్భుతమైనదని, నా జీవితంలో అవే ఆనంద క్షణాలు అంటూ తన రెండో పెళ్లి గురించి ఈమె సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రెండో పెళ్లి తర్వాత ఈమె తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని పలు సందర్భాలలో తెలియజేసిన సంగతి తెలిసిందే.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…