Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ కలిగినటువంటి సితార చాలా చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేయడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇలా సితార దూకుడు కనక చూస్తుంటే అతి త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి సితార సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
సితార ప్రత్యేకంగా డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఎన్నో అద్భుతమైన పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సాయి పల్లవి నటించిన సారంగదరియా పాట ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటకు ఎంతోమంది డాన్స్ చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే సితార సైతం ఈ పాటకు అద్భుతమైన డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.ఇలా సారంగదరియా అంటూ సాయి పల్లవిని కూడా మైమరిపించే విధంగా సితార చేసినటువంటి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ డాన్స్ వీడియో చూసినటువంటి మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు కూతురు చాలా టాలెంట్ అని,ఇండస్ట్రీ లోకి వస్తే హీరోయిన్ గా సక్సెస్ అవుతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…