SK Chandrasekhar: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వరస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న విజయ్ తాజాగా వరీసు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో వారసుడు పేరిట విడుదలైంది.
ఈ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన తమిళంలో మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి విజయ్ గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త వైరల్ గా మారింది ఈయన విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని తేలిపోయింది అలాగే హీరో విజయ్ గత కొంతకాలంగా తన తండ్రితో మాట్లాడటం లేదని ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు తన కుమారుడు విజయ్ కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయన్నమాట వాస్తవమే తాను గత ఏడాదిన్నరగా తన కుమారుడు విజయ్ తో మాట్లాడటం లేదని తెలిపారు. ఇలా మా ఇంట్లో ఇలాంటి గొడవలు జరగడం సర్వసాధారణమైన అని ఇలాంటి అభిప్రాయ భేదాలు రావడం సహజమేనని తెలిపారు.
అయితే వీరిద్దరి మధ్య ఇలాంటి మనస్పర్ధలు రావడానికి గల కారణం కేవలం రాజకీయాలు మాత్రమేనని తెలుస్తుంది.విజయ్ అనుమతి లేకుండా తన తండ్రి బహిరంగ సభను ఏర్పాటు చేసి తన కుమారుడు రాజకీయాలలోకి వస్తున్నాడు అంటూ ప్రకటించారు. అయితే విజయ్ తండ్రి ఇలా చెప్పేసరికి రాజకీయాలలోకి రావడం ఇష్టం లేనటువంటి ఆయన తన తండ్రిపెట్టే పొలిటికల్ మీటింగ్స్ తో తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ వెల్లడించారు దీంతో అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…