Sobhita Dhulipala: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శోభిత ధూళిపాళ్ల ఒకరు. ఈమె బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి శోభిత ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఈమె ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మంకీ మ్యాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఏప్రిల్ 5వ తేదీ విడుదల అయ్యి కేవలం మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతుంది.
ఈ సినిమా ఏప్రిల్ 26వ తేదీ తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈమె తెలుగు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంకీ మ్యాన్ సినిమాలో తన పాత్ర గురించి ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వేశ్యగా..
ఈ సినిమాలో తాను సీత అనే ఒక వేశ్య పాత్రలో కనిపించబోతున్నానని తెలిపారు. ఈ పాత్రలో నటించడానికి నాకు చాలా గౌరవంగా అనిపించిందని తెలిపారు. తప్పకుండా ఈ పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని వెల్లడించారు. ఇలా కథ ప్రాధాన్యత ఉన్నటువంటి ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ శోభిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…