Social Activist Geetha Naidu : గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డిఏవి పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల పాప మీద స్కూల్ డ్రైవర్ అత్యాచారం. రెండు నెలలుగా పాపను వేదిస్తున్న ఆ డ్రైవర్ మరి కొంతమంది పిల్లలను కూడా ఇలాగే లైంగిక వేధింపులకు గురించేసాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపాల్ మాధవి కి డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి స్కూల్ లో కూడా టీచర్స్ మీద అజమాయిషి చేసేవాడని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూలో తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ ను అలాగే ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేసారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటూ సామాజిక వేత్త గీతా నాయుడు అభిప్రాయపడుతున్నారు.

రెండు నెలలుగా హింసించాడు…
నాలుగేళ్ళ పాపం మీద లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉందని గీతా నాయుడు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టిన కెసిఆర్ మరియు ఆయన కుటుంబం పాప విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోలేదు. మంత్రి సబిత ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకుండా ఆలస్యంగా స్పందించారని గీత ఆరోపించారు. ఒక పాపకి కానీ ఒక మహిళకి కానీ ఇలాంటో ఘటన జరిగిన రోజే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదంటూ అభిప్రాయపడ్డారు.

ఏమీ తెలియని ఒక పసిపిల్లను రెండు నెలలుగా బాత్రూమ్ లో అత్యాచారం చేసాడు ఆ డ్రైవర్, ఇంట్లో వాళ్లకి చెబుతే చంపేస్తా అని బెదిరించాడట భయపడిన ఆ పాప విషయం చెప్పలేదు. ఇక ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహారించింది. డ్రైవర్ ను అరెస్టు చేసి తీసుకెళ్తుంటే రెండు రోజుల్లో బెయిల్ వచ్చేలా చేస్తా వెళ్ళు అంటూ చెబుతోందట. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే ఇంకొంతమంది ఇలానే తయారవుతారు. ప్రభుత్వం కఠిన చర్యలు ఇప్పటికైనా తీసుకోక పోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ఆ డ్రైవర్ ను ఉరి తీయాలి, అరబ్ దేశాల్లో విధించే శిక్షలను అమలు చేయాలి అంటూ గీత అభిప్రాయపడ్డారు.




























