కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే… మార్చి 23 నుంచి దశలవారీగా పొడిగించుకుంటూ వస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సంస్థలు తప్ప మిగిలినవి అన్ని మూత పడ్డాయి. దీని ప్రభావంతో ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నష్టాల బారిన పడ్డాయి. తాజాగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే… అయితే ఈసారి కొన్ని సడలింపులు కూడా ప్రకటించింది. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసింది. ఆయా జోన్లలో ఉన్న వైరస్ ప్రభావాన్ని బట్టి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ.
ఈ నేపథ్యంలో మే 7 తర్వాత తమ కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాయి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు. ఈ క్రమంలో ఇప్పటికే తమ ఉద్యోగులకు పలు సంస్థలు ఇమెయిల్స్ కూడా పంపించాయి. మే 7 తరువాత సాఫ్ట్ వేర్ కంపెనీ ఓపెన్ అయితే ఎటువంటి జాగ్రత్తలు, కార్యాచరణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఏఏ జోన్లలో నివశిస్తున్నారు అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నాయి. వారు నివసిస్తున్న జోన్లను బట్టి తగు రవాణా సౌకర్యం కల్పించనున్నాయి. ఈ అంశాలపై ఒక ఫారం తమ ఉద్యోగులకు పంపించి డిటేల్స్ నింపి తిరిగి సెండ్ చేయాలని ఈమెయిల్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…