Categories: FeaturedMovie News

మహానటుడు ఎస్.వి. రంగారావు ఎందుకు విచిత్రంగా ప్రవర్తించారో తెలిస్తే అస్సలు నమ్మరు…

ప్రపంచంలో టాప్ టెన్ బెస్ట్ నటులలో ఎస్.వి.రంగారావు ఖచ్చితంగా ఒక స్థానాన్ని సంపాదించుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అతని నటనకు దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి గారే ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. పాతాళభైరవి సినిమాలో నేపాల మాంత్రికుడు పాత్రలో ఎస్.వి రంగారావు పలికించిన హావభావాలు… చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అతని నటన ఒక్కసారి చూస్తే మన మెదళ్ళలో శాశ్వతంగా ముద్ర పడిపోతుంది. ఒక పాత్రలో ఎలా నటించాలో ముందుగానే మైండ్ మ్యాప్ గీసుకొని ఆ పాత్రలో సహజంగా జీవించగల ఎస్.వి.రంగారావుకు హీరోలతో సమానంగా క్రేజ్ ఉండేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

అతని నటనా ప్రతిభను చూసిన విదేశీ ప్రముఖ నటులు కూడా అబ్బురపడి అతనిని తెగ పొగిడినారు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు పాత్రలో ఎస్.వి.రంగారావు నటనకి యావత్ భారతదేశం ప్రశంసించింది అంటే అతిశయోక్తి కాదు. అతను నటించిన ప్రతి పాత్రకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే ఏమో అనిపిస్తుంది. చిరంజీవి, కమల్ హాసన్, గుమ్మడి వంటి అత్యద్భుతమైన నటులు ఎస్వీ రంగారావు గారిని ప్రేరణగా తీసుకొని సినీ రంగంలో అడుగు పెట్టారు. షావుకారు జానకి సినిమా కంటే ముందుగానే ఎస్.వి.రంగారావు వరూధిని అనే సినిమాలో ప్రవరాఖ్యుడు పాత్రలో నటించి ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు. ఈ సినిమా 1946వ సంవత్సరంలో విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని ఎస్.వి.రంగారావు సరసన దాసరి తిలకం గారు నటించారు.

ఈ సినిమా తర్వాత ఎస్.వి.రంగారావు మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎదురు లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్లారు. నిజానికి అప్పట్లో సహ నాయకుడు, విలన్ పాత్రలలో ఎస్.వి.రంగారావు కంటే అద్భుతంగా ఎవరు నటించలేకపోయే వారు. దీంతో నేనే గొప్ప నటుడిని అనే దర్పం చూపించేవారట ఎస్.వి.రంగారావు. హీరోల కంటే తనకు ఒక రూపాయి ఎక్కువగానే రెమ్యూనరేషన్ ఇవ్వాలనే కండిషన్ కూడా పెట్టేవారట. నిర్మాతలు, దర్శకులు అతనికంటే మంచి నటుడు దొరికడని భావించి అన్ని భరించి అతనికి ఎక్కువ పారితోషికం ఇచ్చేవారట. ఎస్.వి రంగారావు తను నటించే సినిమాలో ఇతర నటీనటులు నచ్చకపోతే తీసేయమని చెప్పేవారట. ఇలా తాను చాలా గొప్ప నటుడిని అని అతనిలో కాస్త అహం ఉండేదట.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago