దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో ఎంతో మందికి సహాయం చేస్తూ అందరిపట్ల ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందుతున్నాడు.కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తూ ఎంతోమంది ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోతున్న సమయంలో సోనూసూద్ పలు ప్రాంతాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.
ఈ విధంగా ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో సహాయం చేస్తున్న సోన సూద్ కరోనా బాధితుల కోసం మరో అడుగు ముందుకు వేశారు.కరోనాతో బాధపడుతున్న ఏ ఒక్కరు ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కోసం ఇబ్బందిపడుతున్న బాధితుల కోసం ఇంటివద్దకే ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు.
దేశంలో ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే
http://www.umeedbysonusood.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని, ఆక్సిజన్ కోసం ఎవరైతే ఈ వెబ్సైట్ సంప్రదిస్తారో, సరాసరి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ కొరియర్ ద్వారా వెళ్తుందని తెలిపారు. అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిస్తామని తెలియజేశారు. అందుకోసం డీటీడీసీ కొరియర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయిన ఆక్సిజన్ అవసరమయ్యే బాధితులు ఎక్కడి నుంచి బుక్ చేసుకున్న వారి ఇంటికి సరాసరి ఆక్సిజన్ సిలిండర్ వెళ్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ విధంగా కరోనా బాధితుల పట్ల సోనుసూద్ చేస్తున్నటువంటి సహాయం పట్ల ఎంతో మంది అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…