కొరియర్ లో ఆక్సిజన్ సిలిండర్.. సోనుసూద్ వినూత్న ప్రయత్నం!

0
122

దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో ఎంతో మందికి సహాయం చేస్తూ అందరిపట్ల ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందుతున్నాడు.కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తూ ఎంతోమంది ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోతున్న సమయంలో సోనూసూద్ పలు ప్రాంతాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

ఈ విధంగా ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో సహాయం చేస్తున్న సోన సూద్ కరోనా బాధితుల కోసం మరో అడుగు ముందుకు వేశారు.కరోనాతో బాధపడుతున్న ఏ ఒక్కరు ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కోసం ఇబ్బందిపడుతున్న బాధితుల కోసం ఇంటివద్దకే ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు.

దేశంలో ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే
www.umeedbysonusood.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని, ఆక్సిజన్ కోసం ఎవరైతే ఈ వెబ్సైట్ సంప్రదిస్తారో, సరాసరి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ కొరియర్ ద్వారా వెళ్తుందని తెలిపారు. అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిస్తామని తెలియజేశారు. అందుకోసం డీటీడీసీ కొరియర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయిన ఆక్సిజన్ అవసరమయ్యే బాధితులు ఎక్కడి నుంచి బుక్ చేసుకున్న వారి ఇంటికి సరాసరి ఆక్సిజన్ సిలిండర్ వెళ్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ విధంగా కరోనా బాధితుల పట్ల సోనుసూద్ చేస్తున్నటువంటి సహాయం పట్ల ఎంతో మంది అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here