Sr. Ntr: తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి తారక రామారావు చేసిన సేవలు గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళు లాంటివారని భావించేవారు. ఇక ఎన్టీఆర్ నటుడిగా మాత్రమే కాకుండా ఇతర నటీనటులను కూడా ఎంతగానో ప్రోత్సహించేవారు. ఈయన జీవితంలో ఎన్నో విలువైన విషయాలను అందరికీ చెబుతూ స్ఫూర్తిగా నిలిచేవారు.
ఇలా ఎన్టీఆర్ గారు చిరంజీవికి ఎన్నో విషయాల గురించి హితబోధ చేశారు. అలాగే కమెడియన్ హీరోగా గుర్తింపు పొందిన రాజేంద్రప్రసాద్ కి సైతం ఎన్టీఆర్ పలు కీలక విషయాలను వెల్లడించారట. నటనపై ఆసక్తి ఉన్నటువంటి రాజేంద్రప్రసాద్ మొదట్లో సీరియల్స్ లో నటించేవారు. ఇక ఈయనకు నటన పట్ల ఆసక్తి రావడంతో ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు తనని ఒక ఫిలిమ్స్ స్కూల్లో జాయిన్ చేశారు అప్పటికి కూడా ఎన్టీఆర్ కి రాజేంద్రప్రసాద్ పై ఎలాంటి నమ్మకం ఉండేది కాదట.
రాజేంద్రప్రసాద్ ఫిలిం స్కూల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో అప్పుడు తనకు సినిమాల పట్ల ఆసక్తి ఉందని నమ్మకం కలిగిందట. ఇలా ఒకరోజు రాజేంద్రప్రసాద్ ని పిలిచి ఎన్టీఆర్ చూడు ప్రసాద్ ఇప్పుడు నీపై నాకు నమ్మకం కలిగింది. అయితే మనం ఇండస్ట్రీలో నిలబడాలి అంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అది మీరు సంపాదించుకోవాలి అని చెప్పారట.
కామెడీ హీరో..
ఇప్పుడు ఎన్టీఆర్ పేరు వినగానే పౌరాణిక చిత్రాలు చేస్తారనే గుర్తింపు నాకుంది. ఇక త్రివిక్రమ రావు అంటే సాంఘిక చిత్రాలు చేస్తారని గుర్తింపు ఉంది. అలా ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉండాలని ఎన్టీఆర్ హితబోధ చేశారట.ఇలా ఎన్టీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీలో మనకంటూ గుర్తింపు రావడం కోసం ఏం చేయాలని రాజేంద్రప్రసాద్ ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పటివరకు అందరూ వివిధ రకాల సినిమాలు చేశారు కానీ కామెడీ హీరోగా ఎవరు నటించలేదని అదే రంగాన్ని ఎంచుకున్నారట. ఇలా కామెడీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, ఎన్టీఆర్ కారణంగానే ఈయన స్టార్ హీరోగా గుర్తింపు పొందారని వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…