Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె మరోవైపు వెండితెరపై కూడా సినిమాలలో సందడి చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా శ్రీముఖి సందడి చేస్తున్నారు.
ఇలా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఈమె నూతన గృహప్రవేశం చేస్తున్నట్టు తెలుస్తుంది.
కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.కొత్త ఇంట్లో తన తల్లితో కలిసి పాలు పొంగిస్తున్నటువంటి ఫోటోలతో పాటు తన సోదరుడు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను శ్రీముఖి షేర్ చేశారు. శ్రీముఖి స్నేహితులను ఎవరిని ఆహ్వానించకుండా కేవలం కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.
ఇలా తన కుటుంబ సభ్యులు మొత్తం పసుపు రంగు దుస్తులను ధరించి గృహప్రవేశ కార్యక్రమాలను పూర్తి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది శ్రీముఖికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…