Sri Reddy : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు సినిమాల్లో కనిపించకపోయినా సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.

చెన్నై రోడ్లపై శ్రీ రెడ్డి…
గత కొన్నిరోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీ లోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడా తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ ఉండటంతో చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది. చెన్నై లో ఉన్న శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానెల్ ద్వారా వంటల వీడియోలు పోస్ట్ చేస్తూ బాగానే ఫేమస్ అయింది.

ఇక అక్కడ లోకల్ యూట్యూబ్ ఛానెల్స్ కుడా ఆమెతో ఇంటర్వ్యూ లు చేస్తున్నారు. ఇక అక్కడ ఫేమస్ అవడం కోసం శ్రీ రెడ్డి కూడా పలు యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో భాగంగా చివర్లో ఆ యూట్యూబర్ శ్రీ రెడ్డికి ఛాలెంజ్ ఇచ్చాడు. రోడ్ పైన బైకర్స్ ని ఆపి వాళ్ళ నెంబర్ తీసుకోవాలి అనేదే ఛాలెంజ్. ఇక శ్రీరెడ్డి అలా కొంతమంది బైక్స్ ని ఆపి వాళ్ళతో మాట్లాడుతున్న వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.





























